- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కిలిమంజారోపై వీగనిజాన్ని వెలుగెత్తిన కూరగాయల శారద
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలో ఎత్తయిన ఏడు శిఖరాల్లో ఒకటైన కిలిమంజారో అధిరోహించిన తొలి మహిళా వీగన్ గా, సీనియర్ జర్నలిస్ట్ కూరగాయల శారద రికార్డు సృష్టించారు. ఆఫ్రికన్ ఖండంలో అతి ఎత్తైన 19,340 అడుగుల కిలిమంజారో పర్వత శిఖరాన్ని శారద తన అయిదుగురు బృందంతో కలిసి సెప్టంబర్ 10న చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా వీగనిజం ప్రచారం చేసి, ప్రజల్లో అవగాహన కల్పించేందుకే తను ప్రపంచంలో అతి ఎత్తైన కిలిమంజారో అధిరోహించే సాహసానికి పూనుకున్నట్లు తెలిపారు.
ఎవరైనా సరే వారి స్వార్థం కోసం ఎదుటి వారిని హింసించరాదని, పాల కోసం రకరకాలుగా పశువుల్ని హింసించడం ఆకోవకు చెందినదే. దాన్ని సహించలేకనే వీగన్ గా మారినట్టు తెలిపారు. వీగన్ గా మారడం పెద్ద కష్టేమేం కాదని, ఉన్నఫళాన మారలేక పోయినా …ప్రయత్నిస్తే దశలవారీగా మారే అవకాశముందని తానే అందుకు సాక్ష్యమని తెలిపారు. తన పర్వత ప్రయాణం వీగన్‌గా మారేవారికి స్పూర్తి కలిగించాలని ఆశిస్తున్నట్లు శారద తెలిపారు.