కరోనాతో భార్య మృతి.. వారం క్రితం భర్త కూడా

by Shyam |
కరోనాతో భార్య మృతి.. వారం క్రితం భర్త కూడా
X

దిశ, కామారెడ్డి: కరోనా మహమ్మారి మూడు రోజుల వ్యవధిలో భార్యాభర్తలను బలితీసుకుంది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం జరిగింది. జిల్లా కేంద్రంలోని పంచముఖి హనుమాన్ కాలనీకి చెందిన వివాహిత కరోనాతో ఇవాళ మృతిచెందింది. కాగా గత మూడ్రోజుల క్రితం మృతురాలి భర్త ఇంట్లో జారిపడి మృతిచెందాడు. చనిపోయిన భర్తకు కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులకు వైద్యులు పరీక్షలు నిర్వహించగా అందులో మృతుని భార్యకు పాజిటివ్ రావడంతో చికిత్సపొందుతూ మృతిచెందింది.

Advertisement

Next Story