- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
యూఎస్ క్యాపిటల్ భవనంలో కాల్పులు
దిశ, వెబ్‌డెస్క్: అమెరికా క్యాపిటల్ భవనంలో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జోబైడెన్ గెలుపును ధృవీకరించేందుకు యూఎస్ కాంగ్రెస్ సమావేశమైంది. కాగా, జోబైడెన్ ఎన్నికను వ్యతిరేకిస్తూ ట్రంప్ మద్దతుదారుల ఆందోళన నిర్వహించారు. ఈ క్రమంలో ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనంలోకి చొచ్చుకెళ్లారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఆందోళనకారులను నిలువరించేందుకు పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. ఈ ఘర్షణ వాతావరణంతో బైడెన్ గెలుపు ధృవీకరణ ప్రక్రియకు ఆటంకం కలిగింది. ట్రంప్ ఆదేశాలతో
కేంద్ర బలగాలను రంగంలోకి దింపినట్లు వైట్ హౌస్ ప్రకటించింది. ఆందోళనకారులు శాంతియుతంగా వ్యవహరించాలంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. తన మద్దతుదారులు పోలీసులకు సహకరించాలని ట్రంప్ పిలుపునిచ్చారు.