అన్నదమ్ములు గొడవ.. నిండుచూలాలు మృతి

by Sumithra |
అన్నదమ్ములు గొడవ.. నిండుచూలాలు మృతి
X

దిశ, చేవెళ్ళ: ఇంటి స్థలం విషయంలో అన్నదమ్ములు గొడవ పడీన సంఘటనలో ఓ నిండు చూలాలు మృతి చెందింది. ఈ సంఘటన శంకర్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్ పల్లి మండలం మోకిల గ్రామానికి చెందిన నిజాం పేట బిక్షపతి, నిజాంపేట పెంటయ్య లు అన్నదమ్ములు. వీరు గత కొంతకాలంగా ఇంటి స్థలం విషయంలో గొడవ పడుతూనే ఉన్నారు.

గ్రామపంచాయతీ సర్పంచ్ వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు ఇరువురి మధ్య రాజీ సైతం కుదిర్చారు. అయినప్పటికీ బుధవారం సాయంత్రం అన్నదమ్ముల ఇంటి సందు విషయంలో బిక్షపతి పెంటయ్య లు గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో బిక్షపతి మనవరాలు లావణ్య (22) ఎందుకు గొడవ పడుతున్నారు. ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా తాతయ్య అంటూ సర్ది చెప్పడానికి ప్రయత్నించగా, పెంటయ్య అతని కుమారుడు శ్రీనివాస్ ఆమెను తోసేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన ఆమెను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం చనిపోయింది. ఆమె ఐదు నెలల గర్భవతి అని మృతురాలు బంధువులు తెలిపారు. శంకర్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ గోపీనాథ్ ఆధ్వర్యంలో మోకిల గ్రామంలో పోలీసులు బారీగా మోహరించారు. గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి పికెటింగ్ ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story