- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కార్పొరేటర్‌పై చర్యలు తీసుకోండి.. హెచ్‌ఆర్సీకి మహిళ ఫిర్యాదు
దిశ, వెబ్ డెస్క్: ఓ మహిళపై అధికార పార్టీకి చెందిన ఓ కార్పోరేటర్ విచక్షణా రహితంగా దాడిచేయడమే గాకుండా ఆయన అనుచరులతోనూ డాడి చేయించాడు. ఈ ఘటన నాలుగు రోజుల క్రితం మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌లో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. బోడుప్పల్ ద్వారకా నగర్‌లో ఆరేండ్ల క్రితం బ్యాంక్ ద్వారా కొన్న ఇంటిలో తమకు వాటా ఉన్నదని స్థానిక టీఆర్ఎస్ కార్పొరేటర్ శ్రీధర్‌గౌడ్ ఆమెపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తన భర్త పూరేందర్ రెడ్డిపై కార్పొరేటర్‌తో పాటు తన అనుచరులతో కలిసి విచక్షణారహితంగా దాడి చేయడంతో బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న బాధిత మహిళ ఆనంతుల బానోదయ కమిషన్‌కు వివరించింది. ఈ ఘటనపై మేడిపల్లి పోలీసుస్టేషన్‌లో దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేసినప్పటికీ కార్పొరేటర్‌తో కుమ్మకైన పోలీసులు తిరిగి తమపై అక్రమంగా కేసు పెట్టి వేదిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దాడి జరిగి నాలుగు రోజులు గడుస్తున్నప్పటికీ కార్పొరేటర్, తన అనుచరులపై కేసు నమోదు చేయకుండా, అరెస్ట్ చేయలేదని ఆమె పేర్కొన్నారు. కార్పొరేటర్ శ్రీధర్ గౌడ్‌తో తమ కుటుంబానికి ప్రాణహాని ఉన్నదని, తమకు రక్షణ కల్పించడంతో పాటు చట్టవ్యతిరేకంగా వ్యవహరించని మేడిపల్లి పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు బానోదయ హెచ్‌ఆర్సీని వేడుకుంది.