- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
8 నెలల గర్భంతో ఏకే 47 చేతబట్టి..
దిశ, వెబ్ డెస్: 8 నెలల నిండు గర్భం, భుజానా ఏకే 47, దట్టమైన దండకారణ్యంలో విధులు. మాములుగా అయితే ఈ దశలో మహిళలు కూర్చుని నిలబడాలంటేనే ఇబ్బంది పడతారు. అడుగులో అడుగులు వేస్తూ నడుస్తారు. ఇంకా చెప్పుకోవాలంటే ఒక్కో దశలో శ్వాస తీసుకునేందుకే కష్టపడుతారు. బీపీ, షుగర్ ఇతర హెల్త్ కండీషన్స్‌తో సతమతమవుతూ ఆస్పత్రులకు క్యూ కడుతారు. బెడ్ రెస్ట్ తీసుకుంటూ అమ్మతనం కోసం ప్రతిరోజు రోజులు లెక్కబెడుతుంటారు. కానీ లేడీ కమాండర్ 8నెలల గర్భాన్ని మోస్తూ విధుల్లో పాల్గొంది. ఏకంగా నక్సలైట్ల ఏరివేత ఆపరేషన్‌లో పాల్గొని ప్రపంచంలో మహిళలు ఏమైనా చేయగలమని నిరూపించింది.
ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నక్సల్స్ ఏరివేత కార్యక్రమం చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో 8నెలల గర్భంతో ఉన్న మహిళా కమాండర్ సునైనా పటేల్ పాలు పంచుకుంది. ఎలాంటి భయం లేకుండా కొండలు ఎక్కి దిగుతూ డ్యూటీ పట్ల తన నిబద్ధతను చాటుకుంటోంది. 2019లో డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్స్ కింద ఏర్పాటు చేసిన దంతేశ్వరి ఫైటర్స్ పూర్తిగా మహిళలతో కూడిన ఫోర్స్. దంతెవాడలో గిరిజనులు పూజించే దంతేశ్వరి మాత పేరిట ఈ ఫోర్స్ స్టార్ట్ చేశారు. దీంట్లో నక్సల్స్ ఉద్యమం నుంచి లొంగిపోయిన మహిళలు, లేడీ పోలీస్‌లకు కఠినమైన ట్రైనింగ్ ఇచ్చి పంపుతారు. ఆయుధ బలగాలతో అడుగుపెట్టాలన్న టార్గెట్‌తో శిక్షణ తీసుకున్న సునైనా దంతేశ్వరి ఫైటర్స్‌లో చోటు దక్కించుకుంది.
తాను విధుల్లో చేరేటప్పటికీ రెండు నెలల గర్భిణీని అని సునైనా చెప్పుకొచ్చింది. అయితే ఈ విషయం తెలిస్తే అధికారులు తీసుకోరని అందుకే దాచిపెట్టి విధుల్లో జాయిన్ అయ్యానని తెలిపింది. ఈ విషయం మొదట తన భర్త భాస్కర్ వద్ద ప్రస్తావిస్తే నో చెప్పాడని, తర్వాత తాను పట్టుబట్టడంతో ఓకే చెప్పినట్లు పేర్కొంది. ఎప్పటికప్పుడు డాక్టర్ల సలహా తీసుకుంటూ డ్యూటీలో కొనసాగుతున్నానని చెప్పింది. గుట్టలు, నదులు ఉండే ప్రాంతాల్లో ఆమె పనితీరును గమనించిన అధికారులు సునైనాను కమాండర్‌గా నియమించారు. దంతేశ్వరి ఫైటర్స్ టీమ్ మొత్తానికి సునైనా రోల్ మోడల్‌గా నిలిచిందని దంతెవాడ జిల్లా ఎస్పీ అభిషేక్ పల్లవ్ తెలిపారు.
tags: Chhattisgarh, Dantewada District, District Reserve Guards, Pregnant, Naxal