బిల్డర్ ఇంటి వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం

by Sumithra |
Woman suicide attempt
X

దిశ, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో ఓ మహిళ ఆత్మహత్యా యత్నం చేసింది. ఇంటి నిర్మాణం విషయమై బిల్డర్ మోసం చేయడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఇంటి నిర్మాణం కోసం డిచ్‌పల్లి మండలం సాంపల్లి గ్రామానికి చెందిన మాసురి స్రవంతి బిల్డర్ నరేష్‌కు డబ్బులు ఇచ్చింది. దీంతో నరేష్ పనిచేయకుండా మోసం చేయడంతో డబ్బు అడగడానికి స్రవంతి వాళ్ల ఇంటికి శనివారం మధ్యాహ్నం వెళ్లింది. బిల్డర్ లేకపోవడంతో క్షణికావేశానికి గురై గ్యాస్ నూనె ఒంటిపై పోసుకొని నిప్పు అంటించుకుంది. స్థానికులు గమనించి 108కు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆర్మూర్ ఎస్‌హెచ్‌వో సైదేశ్వర్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed