నాలుగు రోజుల్లోనే లక్ష కేసులు నమోదు

by  |
నాలుగు రోజుల్లోనే లక్ష కేసులు నమోదు
X

దిశ, న్యూస్‌బ్యూరో: దేశవ్యాప్తంగా ప్రతీరోజూ సగటున సుమారు 23వేల చొప్పున కొత్త పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నాలుగు రోజుల వ్యవధిలోనే కొత్తగా లక్ష కేసులు నమోదయ్యాయి. ప్రతీరోజూ ఒక కొత్త రికార్డు నమోదవుతూ ఉంది. గడచిన 24గంటల్లో 22,752 కొత్త కేసులు నమోదుకాగా 482 మంది చనిపోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7.42 లక్షలకు, మృతుల సంఖ్య 20,642కు చేరింది. దాదాపు 85% పాజిటివ్ కేసులు టాప్ ఫైవ్ రాష్ట్రాల్లోనే ఉన్నాయి. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో దాదాపు మూడింట రెండు వంతుల సంఖ్యలో ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అవుతున్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బాగా పెరుగుతున్న కేసులే దేశంలోని మొత్తం కొత్త కేసుల్లో సింహభాగాన్ని ఆక్రమిస్తున్నాయి.

ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో సుమారు 61% రికవరీ ఉందని, మరణాల రేటు 2.79%గా ఉందని కేంద్ర వైద్యారోగ్య శాఖ పేర్కొంది. కరోనా మృతుల సంఖ్య ఇతర దేశాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నందున అన్‌లాక్ దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ ఉంది.


Next Story

Most Viewed