మై లవ్ అంటూ పెళ్లి ఫొటోలు షేర్ చేసిన మేఘా ఆకాశ్.. నెట్టింట వైరల్‌గా మారిన పోస్ట్

by Disha Web Desk 6 |
మై లవ్ అంటూ పెళ్లి ఫొటోలు షేర్ చేసిన మేఘా ఆకాశ్.. నెట్టింట వైరల్‌గా మారిన పోస్ట్
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ మేఘా ఆకాష్ ‘లై’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటింటి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం ఈ అమ్మడు ఓ రెండు తెలుగు సినిమాల్లో నటిస్తోంది. షూటింగ్స్‌లో పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉంటుంది. ఈ క్రమంలో మేఘా ఆకాష్ పెళ్లి చేసుకోబోతుందంటూ గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే దానికి కారణం ఆమె సాంప్రదాయంగా చీర కట్టుకుని చేతికి గోరింటాకు పెట్టుకుని ఉన్న ఫొటోలు షేర్ చేయడంతో పెళ్లి పుకార్లు షికార్లు చేశాయి.

చెన్నైకి చెందిన ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంటుందని నెట్టింట రూమర్స్ ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో.. తాజాగా, మేఘా ఆకాశ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా పెళ్లి ఫొటోలు షేర్ చేసింది. వెడ్డింగ్ వీక్ డంప్ అంటూ పలు ఫొటోలు పెట్టి.. మై లవ్ శ్వేత కళాధరన్ స్టన్నింగ్ బ్రైడ్ అని క్యాప్షన్ జత చేసింది. దీంతో మేఘా ఆకాష్ కజిన్ పెళ్లి అని క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం ఆమె పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో ఈ అమ్మడుని సంప్రదాయ లుక్స్‌లో చూసిన వారంతా వావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.



Next Story

Most Viewed