ఎన్నికల వేళ సంచలన పరిణామం.. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు నోటీసులిచ్చిన కర్ణాటక పోలీసులు

by Shiva |   ( Updated:2024-05-09 13:32:27.0  )
ఎన్నికల వేళ సంచలన పరిణామం.. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు నోటీసులిచ్చిన కర్ణాటక పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ దేశ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ జాతీయాధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డాకు కర్ణాటక పోలీసులు కాసేపటి క్రితం నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా బీజేపీ సోషల్ మీడియా చీప్ అమిత్ మాలవ్యకు కూడా సమన్లు సర్వ్ చేశారు. అయితే, ఎస్సీ, ఎస్టీ వర్గాలను కించపరుస్తూ.. ఇటీవల ట్విట్టర్ వేదికగా కర్ణాటక బీజేపీ ఓ ట్వీట్ చేసిందంటూ అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నేత పోలీసులకు ఫార్యాదు చేశాడు. ఈ మేరకు బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని బాధ్యులైన జేపీ నడ్డా, అమిత్ మాలవ్యలకు నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లోగా ఇద్దరూ పోలీసుల ఎదుట హాజరు కావాలంటూ ఆ సమన్లలో పేర్కొన్నారు.

కాగా, బీజేపీ షేర్ చేసిన ట్విట్టర్ వీడియోలో కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యల కార్టూన్‌లు ఉన్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ హిందువుల నుంచి నిధులు సేకరించి ముస్లింలకు మళ్లిస్తోందని బీజేపీ పార్టీ సందేశాన్ని పోస్ట్ చేసింది. అయితే దీనిపై వెంటనే స్పందించిన ఈసీ వెంటనే ఆ వీడియోను తీసివేయాల్సిందిగా ఆదేశించింది.

Advertisement

Next Story