ఆ మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది.. మంత్రి ఉత్తమ్ భరోసా

by GSrikanth |   ( Updated:2024-05-10 12:53:36.0  )
Uttam Kumar Reddy
X

దిశ, వెబ్‌డెస్క్: అకాల వర్షం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దనున్న ధాన్యం తడిసిముద్దైంది. దీంతో కొనుగోలుపై రైతుల్లో అనుమానం వ్యక్తం చేశారు. తాజాగా రాష్ట్ర రైతులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భరోసా కల్పించారు. ఒక్క గింజ కూడా వదలకుండా తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. ఎఫ్‌సీఐ ధర తగ్గిస్తే.. తగ్గిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. ధాన్యం కొనుగోలు విషయాన్ని అత్యవసరంగా పరిగణిస్తామని తెలిపారు. మానవతా దృక్పదంతో ప్రభుత్వం ముందుకు వచ్చిందని వెల్లడించారు. నారాయణపూర్ ప్రాజెక్ట్‌ నుంచి రాష్ట్రానికి 2.25 టీఎంసీలు వస్తాయని చెప్పారు. తాగునీటి కోసం నీరు ఇచ్చేందుకు కర్ణాటక ఒప్పుకుంది. నేను, సీఎం ఇద్దరం కర్ణాటక ప్రభుత్వాన్ని కోరిన వెంటనే అంగీకరించిందని అన్నారు.

Advertisement

Next Story