- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏ రోజూ సెలవు తీసుకోలేదు.. కిరణ్ కుమార్ రెడ్డి ఆసక్తిక వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోడీపై రాజంపేట బీజేపీ అభ్యర్థి కిరణ్ కుమార్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ రాజంపేట నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభలో కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోడీ ప్రజల కోసం నిరంతరం పరితపిస్తారని, ఆయన సెలవు తీసుకున్నట్లు ప్రజలు ఎప్పుడైనా విన్నారా అని ప్రశ్నించారు. అయోధ్య రామ మందిరాన్ని నిర్మించిన ఘనత ప్రధాని మోడీది అని ప్రశంసించారు. భారతదేశంపై ప్రధాని మోడీకి ఎనలేని ప్రేమ ఉందని తెలిపారు. పేదలను కుటుంబ సభ్యులుగా భావిస్తారని చెప్పారు. పేదలను ఆదుకునేందుకు ప్రధాని ప్రతినిత్యం కష్టపడుతున్నారన్నారు. పేదలకోసం ప్రతి నిమిషం శ్రమించే శ్రామికుడు నరేంద్రమోడీ అని కిరణ్ కుమార్ రెడ్డి పొగడ్తలతో ముంచేత్తారు. పదేళ్లలో 25 కోట్ల మంది పేదలను దారిద్ర్య రేఖ నుంచి పైకి తీసుకొచ్చారని తెలిపారు. కోవిడ్‌తో ప్రపంచం వణికిపోయిన సమయంలో మోడీ ఆధ్వర్యంలో ధైర్యంగా ఎదుర్కొన్నామన్నారు. దేశంలో వ్యాక్సినేషన్ తయారు చేసి 100 దేశాలకు పంపించారని తెలిపారు. పేదలకు 50 కోట్ల కొత్త బ్యాంకు అకౌంట్లు తెరిచిన ఘనత ప్రధాని మోడీకి దక్కుతుందన్నారు. ఏపీలో ప్రజలను హింసించే పాలన నడుస్తోందని, ఈ ఎన్నికల్లో చరమగీతం పాడాలని కిరణ్ కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు.
Read More...