AP:‘చైనా తరహాలో విద్యుత్ ప్లాంట్లు’.. మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
AP:‘చైనా తరహాలో విద్యుత్ ప్లాంట్లు’.. మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) రాష్ట్రాభివృద్ధే(State Development) లక్ష్యంగా ముందుకెళ్తుంది అని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ(Minister Narayana) పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన నేడు(బుధవారం) రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో చైనా తరహా విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ఈ ప్లాంట్లు చెత్త ఆధారంగా పనిచేస్తాయని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు(CM Chandrababu) చొరవతో చెత్త పన్నును ఎత్తేసినట్లు మంత్రి వెల్లడించారు.

గుంటూరు, విశాఖలో ఈ ప్లాంట్లు అద్భుతంగా పనిచేస్తున్నాయని మంత్రి చెప్పారు. రాజమహేంద్రవరం నగరంలో వివిధ పన్నులు 70 కోట్ల బకాయిలు ఉన్నాయని ప్రజలు వాటిని చెల్లించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు చేశారు. మూడేళ్లలో రాజధాని అమరావతి పనులు పూర్తి చేస్తామని వ్యాఖ్యానించారు. వచ్చే జనవరికి 62,000 కోట్లతో టెండర్లు పిలుస్తామని తెలిపారు. గత ప్రభుత్వం నిధులను దారి మళ్లీంచిందని మండిపడ్డారు. విపరీతంగా పన్నులు పెంచి ప్రజలను దోపిడీ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరిగి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నాం అని మంత్రి నారాయణ తెలిపారు.

Advertisement

Next Story