Breaking: నల్లమలలో చిక్కుకుపోయిన 15 మంది భక్తులు.. గాలింపు

by srinivas |
Breaking: నల్లమలలో చిక్కుకుపోయిన 15 మంది భక్తులు.. గాలింపు
X

దిశ, వెబ్ డెస్క్: భక్తులు నల్లమల అడవి(Black Forest)లో చిక్కుకుపోయిన ఘటన ప్రకాశం జిల్లా(Prakasam District)లో జరిగింది. రేపల్లె మండలం మంత్రిపాలేనికి చెందిన 15 మంది భక్తులు.. నల్లమలలోని కామేశ్వరీదేవి(Kameshwari Devi)ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేద్దామనుకున్నారు. ఈ మేరకు నల్లమలలో బయల్దేరారు. అయితే మార్గమధ్యలో భక్తులకు బిగ్ షాక్ తగిలింది. కొంతదూరం వెళ్లిన తర్వాత దారి తప్పిపోయారు. ఎటు వెళ్లాలో తెలియక అక్కడే నిలిచపోయారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందజేశారు. తాము అడవిల్లో చిక్కుకుపోయాని, తమను రక్షించాలని కోరారు. దీంతో పోలీసులు నల్లమల్లలో గాలిస్తున్నారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా భక్తులను గుర్తించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement

Next Story