Ambuja Cements: అంబుజా సిమెంట్స్‌లో సంఘీ ఇండస్ట్రీస్‌, పెన్నా సిమెంట్‌ విలీనం..!

by Maddikunta Saikiran |
Ambuja Cements: అంబుజా సిమెంట్స్‌లో సంఘీ ఇండస్ట్రీస్‌, పెన్నా సిమెంట్‌ విలీనం..!
X

దిశ,వెబ్‌డెస్క్: గౌతమ్ అదానీ(Gautham Adani) నేతృత్వంలోని అదానీ గ్రూప్(Adani Group)కు చెందిన అంబుజా సిమెంట్స్‌(Ambuja Cements) అనుబంధ సంస్థలు సంఘీ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్(SIL), పెన్నా సిమెంట్‌ ఇండస్ట్రీస్‌(PCI) విలీనం కానున్నాయి. ఈ విషయాన్ని సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ విలీనాన్ని 9 నుంచి 12 నెలల వ్యవధిలో పూర్తి చేయనున్నట్లు తెలిపింది. కాగా అదానీ గ్రూప్ సౌరాష్ట్ర(Saurashtra) కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సంఘీ ఇండస్ట్రీస్‌ ను గతేడాది డిసెంబర్ నెలలో సొంతం చేసుకోగా.. ఆంధ్రప్రదేశ్‌కు(AP) చెందిన పెన్నా సిమెంట్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ను ఈ ఏడాది ఆగస్టులో కొనుగోలు చేసింది. ఈ క్రమంలో సిమెంట్ తయారీ కార్యకలాపాలను ఒక్కచోటికి చేర్చాలని అదానీ గ్రూప్ భావిస్తోంది. ఇందులో భాగంగానే మూడు సిమెంట్ కంపెనీలను విలీనం చేయాలనే నిర్ణయానికి వచ్చింది. విలీన స్కీము ప్రకారం, ప్రతి 100 సంఘీ ఇండస్ట్రీస్‌ షేర్లకు అంబుజా సిమెంట్స్‌ 12 షేర్లను జారీ చేయనుంది. మరోవైపు, పెన్నా సిమెంట్‌ ఈక్విటీ షేర్‌హోల్డర్లకు ఒక్కో షేరుకు రూ. 321.50 చెల్లించనుంది. సంఘీ ఇండస్ట్రీస్‌, పెన్నా సిమెంట్స్‌ షేర్ల విలువ రూ. 10గా ఉండగా, అంబుజా సిమెంట్స్‌ షేరు విలువ రూ. 2గా ఉంది.

Advertisement

Next Story

Most Viewed