- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Ravichandran Ashwin : అశ్విన్ రిటైర్మెంట్‌పై సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు

దిశ, స్పోర్ట్స్ : సిరీస్ మధ్యలోనే అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడాన్ని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తప్పుబట్టాడు. ఓ స్పోర్ట్స్ ఛానెల్‌తో ఆయన బుధవారం మాట్లాడాడు. ‘అశ్విన్ నిర్ణయంతో వచ్చే రెండు టెస్టులకు భారత్ ఓ ఆటగాన్ని కోల్పోయింది. 2014-15లో సిరీస్ మధ్యలోనే ధోనీ రిటైర్మెంట్ ప్రకటించాడు. అశ్విన్ ప్రస్తుతం అలానే చేశాడు. సిడ్నీలో జరిగే చివరి టెస్ట్‌లో అశ్విన్ కీలక పాత్ర పోషించేవాడు. ఈ స్పిచ్ స్పిన్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. సిరీస్ ముగిసిన తర్వాత ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించాలి. మధ్యలో కాదు. సెలక్షన్ కమిటీ ప్రతి టూర్‌కు ఆటగాళ్లను ఓ ప్రయోజనం కోసం ఎంపిక చేస్తుంది. ఆటగాళ్లలో ఎవరికైనా గాయం అయితే వెంటనే రిజర్వ్ ప్లేయర్లకు అవకాశం ఇస్తుంది. సిడ్నీలో జరిగే ఐదో టెస్టులో ఇద్దరు స్పిన్నర్లను భారత్ ఆడించే అవకాశం ఉంది. ఆ సమయంలో అశ్విన్‌కు తప్పకుండా ఆడే అవకాశం వచ్చేది.’ అని సునీల్ గవాస్కర్ అన్నాడు.