కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజ్ భవన్ ముట్టడి…

by Aamani |
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజ్ భవన్ ముట్టడి…
X

దిశ, ఖైరతాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజ్ భవన్‌ను ముట్టడికి బుధవారం పిలుపునిచ్చింది.ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి గారితో పాటు కార్పొరేటర్లు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఎన్‌ఎస్‌యుఐ యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రధాని మోడీ ఆదా నీతో లాలూచీ పడ్డారని ఆరోపించారు. అదానీ -మోడీ కలయిక దేశ ప్రతిష్టను దిగజార్చిందని విమర్శించారు. ఆదానీపై అమెరికాలో కేసులు నమోదైనా, ప్రధాని మోదీ మౌనం వీడకపోవడంపై ప్రశ్నించారు. మోడీ మౌనం కొనసాగితే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే రాష్ట్రపతి భవన్‌ను సైతం ముట్టడిస్తామని అన్నారు. రాహుల్ గాంధీ పిలుపు మేరకు రాజ్ భవన్‌ను ముట్టడించామని చెప్పారు. “ప్రభుత్వం ధర్నాలు చేయడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. ముందుగా బీఆర్ఎస్ ఆదానీ విషయంలో తమ వైఖరిని స్పష్టంగా చెప్పాలి,” అని డిమాండ్ చేశారు.

75 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ దేశ ప్రతిష్టను పెంచిందని, కానీ మోడీ-అదానీ కలయిక దానిని దిగజార్చిందని విమర్శించారు. వ్యాపారాల కోసం అదానీ అంచాలు ఇచ్చారని అమెరికా సంస్థలు తేల్చాయని గుర్తు చేశారు.అదానీ పై జేపీసీ నేతృత్వంలో విచారణ జరగాలని డిమాండ్ చేశారు. అదానీని కాపాడటానికి ఎవరు ప్రయత్నిస్తున్నారో తేల్చాలని స్పష్టం చేశారు. తమ పోరాటం ఇక్కడితో ఆగదని, మోడీ మౌనం వీడకపోతే రాష్ట్రపతి భవన్ ఎదుట ధర్నా చేపడతామని ప్రకటించారు.

Advertisement

Next Story