విమానం నుంచి ఎగురుతున్న సిలిండర్ ను చూసిన మహిళ.. వీడియో వైరల్

by Sumithra |
విమానం నుంచి ఎగురుతున్న సిలిండర్ ను చూసిన మహిళ.. వీడియో వైరల్
X

దిశ, ఫీచర్స్ : ప్రకృతి సృష్టించిన ఈ భూమ్మీద ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. కొన్ని సంఘటన మన ముందు జరిగినప్పుడు ఉలిక్కి పడటానికి కారణం ఆ అంతుచిక్కని రహస్యాలే. ముఖ్యంగా మనం గ్రహాంతరవాసుల గురించి మాట్లాడినట్లయితే ఇప్పటివరకు ఏ ఒక్క శాస్త్రవేత్త కూడా గ్రహాంతర వాసుల ఉనికిని, వారి రహస్యాలను చేధించలేదు. గ్రహాంతరవాసులకు సంబంధించిన ఏదైనా ఒక విషయం చర్చకు వచ్చిన వెంటనే వైరల్ అవడానికి కారణం కూడా ఇదే. ప్రస్తుతం ఇలాంటి ఒక చర్చే మొదలైంది.

ఇటీవలి కాలంలో ఓ ఇంట్రెస్టింగ్ వీడియో బయటికి వచ్చింది. వీడియో రిలీస్ అయిన కొన్ని నిమిషాల్లోనే తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోని తీసేటప్పుడు ఆ మహిళ ఒక్కసారిగా ఉలిక్కిపడిందట. వీడియోలో ఏదో వింత ఆకారాన్ని చూసి ఆశ్చర్యపడిందిట. ఇంతకీ ఆ వీడియో ఎక్కడ తీశారు, ఆ వీడియోలో ఏం కనిపించిందో చూద్దాం.

మిచెల్ అనే ప్రయాణికురాలు విమానంలో ప్రయాణిస్తూ సరదాగా కిటికిలోంటి వీడియో తీసి ప్రారంభించింది. ఆ వీడియోలో గాలిలో ఎగురుతున్న ఒక సిలిండర్ కనిపించినట్లు తెలిపింది. ఇది చూసిన తర్వాత ప్రజలు దీనిని గ్రహాంతర విమానం UFO గా పరిగణించడం ప్రారంభించారు. ఈ సిలిండర్ ఆకారంలో ఉన్న విమానం ప్రజలను ఎంతగానో ఆశ్చర్యపరిచింది.

దీనిని చూసిన వెంటనే ఆ ప్రయాణికురాలు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్‌కు ఇమెయిల్ చేసి, తాను చూసినదాన్ని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారుతోంది. వీడియోలో ఒక పొడవైన ఓవల్ వస్తువు ఎగురుతూ కనిపించడాన్ని చూడవచ్చు. దీన్ని జాగ్రత్తగా చూస్తే అది UFO లాగా కనిపిస్తుందని తెలిపారు.

ఇక ఈ వీడియో చూసిన తర్వాత ఇందులో అసాధారణమైన విషయం ఉందని నిపుణులు తెలిపారట. దీనిపై విచారణ జరపాలని, దీని వేగం కూడా ఎంతో ఎక్కువగా ఉందన్నారట. అయితే వీడియోని చూసిన వారిలో కొంతమంది దీన్ని డ్రోన్ గా భావిస్తున్నారట. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం ఏ డ్రోన్ కూడా విమానానికి దగ్గరగా ఉండదు. ఈ వీడియోకు సంబంధించి ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నుండి తనకు ఎటువంటి సమాధానం రాలేదని, అమెరికన్ పరిపాలన కూడా పదేపదే తిరస్కరిస్తున్నదని మహిళ పేర్కొంది. ఈ విషయం పై మిచెల్ మాట్లాడుతూ ఇది నాకు చాలా బాధగా ఉందని తెలిపారు.

Advertisement

Next Story