- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుమారి ఆంటీ రేంజ్ లో ఫేమస్ అవుతున్న వడపావ్ అక్క.. రోడ్డు పై ఆ లొల్లేందో..
దిశ, ఫీచర్స్ : ఢిల్లీలోని వడ పావ్ అమ్మాయి గుర్తుందా.. అదేనండి ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్‌లో ప్రకంపనలు సృష్టించిన వీడియో తాలూకు అమ్మాయి. ఆ వీడియోలో ఆమె ఏడుస్తూ వడ పావ్ అమ్ముతున్నట్లు కనిపించింది. MCD తన స్టాల్‌ను తొలగించిందని ఆమె ఆరోపించారు. డబ్బులు చెల్లించినప్పటికీ ఎంసీడీ దుకాణాన్ని తొలగించేందుకు చూస్తున్నారని తెలిపారు. దీని గురించి ఆమె ఏడుస్తూ సహాయం కోసం వేడుకున్నారు. ఇప్పుడు మరోసారి ఈ వైరల్ గర్ల్ చంద్రిక గేరా దీక్షిత్ వీడియో చర్చనీయాంశమైంది. ఈసారి ఆమె తన తల్లితో పాటు గుంపులో జనంతో వాదిస్తూ కనిపించింది.
ఈ వడపావ్ అక్క తల్లి ఎలక్ట్రిక్ స్కూటర్ పై కూర్చొని, వ్యక్తులతో గొడవపడటం దాన్ని రికార్డ్ చేస్తున్న వ్యక్తుల పై అరుస్తూ ఉండటం చూడవచ్చు. గొడవ పడుతూ గుంపునుంచి వెళ్లిపోవడం చూడవచ్చు. కొంత సమయం తర్వాత ఆమె తల్లికూడా తన స్కూటర్ పై వెళ్లిపోవడాన్ని చూడవచ్చు. అలా వెళుతూ 'వడ పావ్ గర్ల్' పై ఒక మహిళ దాడి చేయడానికి ప్రయత్నించింది. ఆ మహిళ చంద్రికను గట్టిగా పట్టుకోవడంతో కోపంతో గట్టిగా అరుస్తుంది. ఆ ఇద్దరి మధ్య వార్ ఒక రేంజ్ లో జరుగుతుంది. ఇద్దరూ దూకుడుగా చూసుకుంటూ ఒకరినొకరు అరుచుకున్నారు. అయితే ఈలోగా కొంత మంది జోక్యం చేసుకుని ఇద్దరినీ విడదీశారు.
ఇంతకీ ఈ గొడవ ఎందుకు జరుగుతుందో ఇప్పటివరకు తెలియదు. గొడవకు దిగిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకున్నారా లేదా అనేది తెలియలేదు. అయితే గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దాదాపు రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోని ఇప్పటికి వేల సార్లు వీక్షించగా, ప్రజలు రకరకాలుగా రియాక్షన్స్ ఇచ్చారు. కొంతమంది ఈ వైరల్ అమ్మాయి పై కోపంగా ఉన్నారు. ఆమెను జైలులో పెట్టాలని అంటున్నారు. అయితే ఒక వినియోగదారు రాఖీ సావంత్‌కు మరో రూపం అని రాశారు.