- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతు చట్టాలను వెనక్కి తీసుకోవడం చారిత్రాత్మక తప్పిదం : తుమ్మనపల్లి శ్రీనివాసు
దిశ, సిద్దిపేట: రైతులకు లాభమే తప్ప నష్టం లేని మూడు రైతు చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఈరోజు లోక్ సభలో వెనక్కి తీసుకోవడం చారిత్రాత్మక తప్పిదం అని లోక్ సత్తాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మనపల్లి శ్రీనివాసు అన్నారు. దేశంలోని ప్రధాన జాతీయ పార్టీలు, ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు దూర దృష్టితో రైతుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోలేదని ఆయన అన్నారు. దేశ ప్రయోజనాల కంటే సొంత పార్టీల ప్రయోజనాలే ముఖ్యం అనుకున్న పార్టీల వైఖరి మారాలని పేర్కొన్నారు. రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై శాశ్వత పరిష్కారాలతో కూడిన ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలను సైతం చూపకుండానే కేవలం తమ సొంత పార్టీల భవిష్యత్తుకే ప్రాధాన్యం ఇవ్వడం దురదృష్టకరం అన్నారు. రైతుల ఆదాయం పెరగడానికి సాగు సమస్యల పరిష్కారానికి ఒక మంచి అవకాశాన్ని అధికార, ప్రతిపక్ష పార్టీలు అన్నీ జారవిడుచుకున్నాయని ఇకనైనా రాజకీయాలకు అతీతంగా రైతు సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని తుమ్మనపల్లి తెలిపారు.