- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇలాంటి ఆపత్కాలాలే ఫ్రెండ్స్‌ను క్లోజ్ చేస్తాయి : మోడీ
న్యూఢిల్లీ : హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్‌కు ప్రధాని మోడీ స్పందించారు. ఇటువంటి(కరోనా) ఆపత్కాలలే మిత్రులను మరింత సన్నిహితం చేస్తాయని పేర్కొన్నారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందుల ఎగుమతిపై ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం సడలించాక.. ట్రంప్ భారత్‌పై ప్రశంసలు కురిపిస్తూ ఒక ట్వీట్ చేశారు. దీనికి ప్రతిస్పందనగా.. ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. కరోనా మహమ్మారిపై శక్తియుక్తులమేరకు పోరాడేందుకు మానవాళికి భారత్ సదా సహాయపడుతుందని మోడీ తెలిపారు. ఇటువంటి ఆపద సమయాలే ఫ్రెండ్స్‌ను మరింత క్లోజ్ చేస్తుందని వివరించారు. అమెరికా, భారత్‌ల భాగస్వామ్యం గతంలో ఎన్నడూ లేనంత దృఢమైందని తెలిపారు. మనమంతా ఐక్యంగా ఈ మహమ్మారిని జయిస్తామని పేర్కొన్నారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రల ఎగుమతిపై ఆంక్షలు విధించిన రెండు వారాలకు తమ దేశానికి ఈ మందులు సరఫరా చేయకుండా భారత్ పై ప్రతీకారం తీర్చుకుంటామని ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. కాగా, ఆంక్షలు సడలించిన తర్వాత ట్రంప్ భారత్‌ను పొగడ్తల్లో ముంచారు.
Tags: modi, trump, friendship, stronger, close, tweet, hydroxy chloroquine