- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మళ్ళీ లాక్ డౌన్ తప్పదా?
దిశ ప్రతినిధి, వరంగల్ : ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మరోసారి విజృంభించే అవకాశాలున్నట్లు జరుగుతున్న ప్రచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చలికాలం కావడంతో మహమ్మారి మరింతగా ప్రబలే ప్రమాదం ఉందని డాక్టర్లు పదేపదే హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో చలి తీవ్రత అధికం అవుతుండడంతో జనం బెంబేలెత్తుతున్నారు. కొద్ది రోజుల క్రితం నుంచే జనం రోడ్లపైకి వచ్చిన తరుణంలో పిడుగులాంటి వార్త కొత్త సమస్యలకు దారితీస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోసారి లాక్‌డౌన్ ప్రకటిస్తారని ప్రచారం జరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
కరోనాతో ఆగమాగం..
మార్చిలో కరోనా కేసులు నమోదు కావడంతో ముందు జాగ్రత్తగా మార్చి 23 నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించాయి. అయినప్పటికీ కేసులు నమోదయ్యాయి. కొందరు కరోనాకు చిక్కకపోయినా ఆర్థికంగా చితికిపోయారు. లాక్‌డౌన్ కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయింది. జూన్ నుంచి లాక్‌డౌన్‌ను విడతల వారీగా సడలిస్తూ వచ్చారు.
లాక్ డౌన్ తప్పదా?
కరోనా మహమ్మారి నుంచి జనం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న క్రమంలో చలికాలం దృష్ట్యా నవంబర్, డిసెంబర్, జనవరి మాసాల్లో మరింతగా ప్రబలే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీంతో మరోసారి దేశంలో లాక్‌డౌన్ విధించే అవకాశాలు లేకపోలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు మూడు నెలల పాటు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రానున్న మూడు నెలల కాలం కీలకం కానుండడంతో అలర్ట్‌గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని డాక్టర్లు సూచిస్తున్నారు.