భారత్‌తో బలంగా నిలబడతాం: యూఎస్

by Shamantha N |
భారత్‌తో బలంగా నిలబడతాం: యూఎస్
X

న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల్లో యూఎస్ మిలిటరీ భారత్‌వైపే బలంగా నిలబడుతుందని అమెరికా స్పష్టం చేసింది. తాము చైనాకు తోడుగా నిలవబోమని, ఒక రీజియన్‌లో లేదా వేరే ఓ చోటనైనా ప్రాబల్య దేశంగా, మోస్ట్ పవర్‌ఫుల్‌‌గా ఎదిగి పరిస్థితులు అదుపులోకి తీసుకోవడాన్ని కచ్చితంగా అడ్డుకుంటామని వివరించింది. తమ మిలిటరీ భారత్‌కు తోడుగా నిలుస్తుందని వైట్‌హౌజ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మార్క్ మీడోస్ వెల్లడించారు. అది భారత్, చైనా ఘర్షణలైనా, మరే వివాదాల్లోనైనా భారత్‌కు అమెరికా మిలిటరీ తోడుగా నిలుస్తుందని, భవిష్యత్‌లోనూ ఇలాగే కొనసాగుతుందని తెలిపారు. సరిహద్దులో భారత్, చైనాల మధ్య దాదాపు ఎనిమిది వారాలుగా ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉన్నది. జూన్ 15నాటి ఘర్షణల్లో ఇరువైపులా జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా, సోమవారం మిలిటరీ చర్చల ఒప్పందం మేరకు చైనా ట్రూపులు వెనక్కి మళ్లాయి. దక్షిణ చైనా వివాదాస్పద జలాల్లో అమెరికా ఎయిర్‌క్రాఫ్టులు ఎక్సర్‌సైజులు నిర్వహించిన మూడు రోజుల తర్వాత వైట్‌‌హౌజ్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. కాగా, అమెరికా ఎక్సర్‌సైజుల తర్వాత చైనా కూడా డ్రిల్స్ నిర్వహించగా, పెంటగాన్ సహా పొరుగుదేశాలు విమర్శించాయి.

Advertisement

Next Story

Most Viewed