- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేను ఎన్నికల్లో పాల్గొనను: ఒమర్ అబ్దుల్లా
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం(యూటీ)గా ఉన్నన్ని రోజులు ఎలాంటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ పాల్గొనబోనని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా తెలిపారు. అత్యంతా సాధికారిక అసెంబ్లీ(జమ్ము కశ్మీర్ రాష్ట్ర) సభ్యుడిగా ఆరేళ్లు కొనసాగిన తాను సాధికారత కరువైన అసెంబ్లీ సభ్యుడిగా ఎన్నుకోబడటాన్ని ఇష్టపడరని ఓ మీడియాకు రాసిన వ్యాసంలో పేర్కొన్నారు.
జమ్ము కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తినిచ్చిన ఆర్టికల్ 370ని నీరుగార్చి, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించే నిర్ణయం తీసుకుని ఆగస్టు 5కు ఏడాది నిండుతున్న సందర్భంలో సుమారు 230 రోజులు నిర్బంధాన్ని అనుభవించిన ఒమర్ అబ్దుల్లా తన అభిప్రాయాలను ఆ వ్యాసంలో పంచుకున్నారు.
370 అధికరణంపై నిర్ణయాలకు కొద్ది రోజుల ముందే ప్రధాని మోడీతో జరిగిన భేటీని గుర్తుచేశారు. కశ్మీర్‌లో జరుగుతున్న పరిణామాలతో ఆందోళనగా ప్రధానిని కలిశామని వివరించారు. ఆ సమావేశంలో చెప్పిన విషయాలతో స్థిమిత పడ్డారని, కానీ, బయట పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా వేగంగా మారాయని తెలిపారు. ఆ రోజు ఉదయం టీవీలో వార్తలతో భీతిల్లారని, మధ్యాహ్నంకల్లా తనను గృహనిర్బంధం చేశారని, అదే రోజు ప్రభుత్వ గెస్ట్ హౌజ్‌కు తరలించారని వివరించారు.