కనువిందు చేసిన పసుపు పెంగ్విన్.. ఎక్కడో తెలుసా?

by Sujitha Rachapalli |
కనువిందు చేసిన పసుపు పెంగ్విన్.. ఎక్కడో తెలుసా?
X

దిశ, ఫీచర్స్: శ్వేతవర్ణంలో మెరిసిపోతూ మంచు ప్రాంతంలో బ్లాక్ అండ్ వైట్ రంగుల్లో కనిపించే ‘పెంగ్విన్స్’ చూడముచ్చటగా ఉంటాయి. ఈ ఎగరలేని పక్షుల్లో 18 జాతులుండగా, లిటిల్ బ్లూ, రాయల్, మాక్రోని, రాక్‌హోపర్ పెంగ్విన్స్ చూడ్డానికి కాస్త భిన్నంగా ఉంటాయి. బ్యాండెడ్ పెంగ్విన్స్ మాత్రం చాలా భాగం నలుపుతో ఉంటాయి. అయితే ఇప్పటివరకు ఉన్నవాటిలో కంటే కాస్త కలర్‌ఫుల్‌గా ఉన్న ఓ పెంగ్విన్‌ సౌత్ జార్జియాలో కనిపించింది. వైవ్స్ ఆడమ్స్ అనే వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ ఈ డిఫరెంట్ కలర్డ్ పెంగ్విన్‌ను తన కెమెరాలో క్యాప్చర్ చేశాడు.

వైల్డ్ ఫొటోగ్రాఫర్ వైవ్ ఆడమ్స్ తన న్యూ ప్రాజెక్ట్‌లో భాగంగా అంటార్కిటికా, దక్షిణ అట్లాంటిక్‌లో రెండు నెలల యాత్రకు వెళ్లాడు. ఈ క్రమంలో దక్షిణ జార్జియాలోని వైల్డ్ ఐలాండ్‌లో ఆడమ్స్ గుంపులు గుంపులుగా ఉన్న ‘పెంగ్విన్స్’ ఫొటోలు తీశాడు. అక్కడి బీచ్‌లో 1.2లక్షల పెంగ్విన్లు ఉండగా, పసుపు రంగులో హొయలు పోతున్న ఓ భిన్నమైన పెంగ్విన్ తన దృష్టిని ఆకర్షించింది. సాధారణమైన బ్లాక్ అండ్ వైట్ పెంగ్విన్లకు భిన్నంగా, ప్రకాశవంతమైన పసుపు రంగు వన్నెలతో ఉన్న దాన్ని ఫొటోలు తీసి మురిసిపోయాడు. ‘నేను ఇంతకు ముందెన్నడూ పసుపు పెంగ్విన్ చూడలేదు. ఆ బీచ్‌లో వేలాది పక్షులున్నాయి. ఈ ఒక్క పెంగ్విన్ మాత్రమే పసుపు రంగులో ఉంది. ఆ పక్షిని చూడటం, ఫొటో తీయడం చాలా ప్రత్యేకమైన అనుభవం. అయితే ఇది లూసిజం అనే వ్యాధి కారణంగానే ఇలాంటి రంగును పొంది ఉండొచ్చు. ఈకలకు నలుపుదనాన్నిచ్చే మెలనిన్ ఉత్పత్తి కాకపోవడంతోనే, ఈ పక్షికి పసుపు రంగు వచ్చి ఉండొచ్చు. లూసిజం అనేది పక్షుల్లో అరుదుగా కనిపించే వ్యాధి. ఇది సోకిన పక్షులు తమ రంగును కోల్పోతాయి’ అని ఆడమ్స్ పేర్కొన్నాడు.

Advertisement

Next Story

Most Viewed