ఇకనుంచి రైల్వే స్టేషన్‌లో వైఫై ఫ్రీ..

by Shamantha N |
railway station
X

దిశ, వెబ్‌డెస్క్: భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని 4 వేల రైల్వే స్టేషన్‌లలో హైస్పీడ్‌ ప్రీపెయిడ్‌ ఇంటర్నెట్‌ అందిస్తున్నట్లు భారతీ రైల్వేకు చెందిన రైల్‌టెల్‌ సంస్థ ప్రకటించింది. దేశంలోని మొత్తం 5,950 రైల్వే స్టేషన్‌లలో వైఫై సదుపాయం ఉందని, ఇందులో ప్రీపెయిడ్‌ వైఫై సదుపాయం 4వేల స్టేషన్‌లలో లభిస్తుంది. రైల్వే స్టేషన్‌లలో ఎవరైనా ఉచితంగా వైఫైని ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని, కాకాపోతే.. మొదట 30 నిమిషాలు ఫ్రీగా వైఫై ఉపయోగించుకోవచ్చని, ఆ తర్వాత డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌లో ఓటీపీ బెస్ట్‌ వెరిఫికేషన్‌ ద్వారా వైఫై అందిస్తోంది. ప్రస్తుతం 4 వేల రైల్వే స్టేషన్‌లలో పెయిడ్‌ వైఫై ని రైల్‌టెల్‌ ప్రారంభించింది.

Advertisement

Next Story

Most Viewed