- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అవి కట్ చేసి.. భర్తను చంపేసింది
దిశ, వెబ్ డెస్క్: ఒక వ్యక్తి జీవించండం వేరు.. ఇద్దరు వ్యక్తులు కలిసి జీవిచండం వేరు. ఓ వ్యక్తి సింగిల్ గా జీవించినప్పుడు తనకు తానే బాస్.. తనకు నచ్చిందే ఫైనల్.. ఇలా అతడి జీవితం ముందుకు వెళ్లిపోతంటది. కానీ, ఇద్దరు వ్యక్తులు జీవించాల్సి వచ్చినప్పుడు మాత్రం ఆ ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఒకరి భావాలు ఒకరు పంచుకోవాలి. మరే విషయాలైనా ఒకరికొకరు షేర్ చేసుకుంటూ ఆనందంగా జీవించాలి. కానీ, ఈ క్రమంలో ఇద్దరిలో ఏ ఒక్కరు విరుద్ధంగా వ్యవహరించినా మనస్ఫర్ధలు వచ్చే అవకాశముంటది. దాంతో వారు విడిపోయే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఒకవేళ ఇలా జరిగినా ఓకే. ఎందుకంటే అంతటితో ఆ వ్యవహారానికి స్వస్తి చెప్పి ఒకరికొకరు దూరమైనప్పటికీ వారువారు ఇష్టానుసారంగా ఆనందంగా తమకు నచ్చిన విధంగా జీవించే అవకాశముంటది. కానీ, ఇలాంటివి ఫేస్ చేస్తున్న కొందరు వ్యక్తులు ఘోరాలకు పాల్పడుతున్నారు. ఎదుటి వ్యక్తి ప్రాణాలను బలిగొంటున్నారు. తాజాగా కూడా పశ్చిమ బెంగాల్ లో ఓ ఘటన చోటు చేసుకుంది. మర్మంగాలు కోసి భర్తను భార్య చంపేసింది.
వివరాల్లోకి వెళితే.. కొల్ కతాలోని జూజర్షా గ్రామంలో మహసిన్ మల్లిక్- మనీరా అనే వీరిద్దరూ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, వీరిద్దరి మధ్య గత కొద్ది రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా కూడా మరోసారి వీరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె తన భర్తను చంపేసింది. ముందుగా రాడ్డుతో అతడి తలపై బాదింది. అయినప్పటికీ అతను చనిపోలేదు. ఇది గమనించి.. అతడి మర్మంగాలను కట్ చేసింది. అనంతరం ఆమె పోలీసులకు ఫోన్ చేసి తానే తన భర్తను చంపేసినట్లు చెప్పింది.
విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకుని పరిశీలించారు. భర్త శవం అక్కడే రక్తపు మడుగుల్లో పడి ఉంది. ఎందుకు ఇలా చేశావ్ అని ఆమెను పోలీసులు ప్రశ్నించగా తనను, తన పుట్టింటి వారిని పదేపదే తిడుతుండే వాడని, రాత్రి కూడా ఇలా తిడుతుంటే కోపమొచ్చి చంపేశానని చెప్పుకొచ్చింది. దీంతో ఆమెను అరెస్ట్ చేశారు. అనంతరం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.
అయితే, మరో విషయమేమిటంటే.. ఆమె మానసిక పరిస్థితి సరిగా లేదని, ఈ కారణంగా ఆమె గత కొన్నాళ్ల నుంచి మెడిసిన్ వాడుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ఆమె తన భర్తను చంపేసి ఉంటుందని అక్కడ చెవులు కొరుక్కుంటున్నారు. చూడాలి మరీ.. పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో చివరికి వాస్తమేమిటి తేలనుందో అనేది.