భర్తను దారుణంగా పొడిచి చంపిన భార్య

by Sumithra |   ( Updated:2020-09-04 05:29:49.0  )
భర్తను దారుణంగా పొడిచి చంపిన భార్య
X

దిశ, వెబ్‌డెస్క్: జల్సాలకు అలవాటు పడ్డాడని ఓ మహిళ భర్తను దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… తిరుపత్తూరు జిల్లా అల్లం కుప్పం ప్రాంతానికి చెందిన రమేశ్ బాబు పదేండ్ల క్రితం జయంతి మాల అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నారు. రమేష్ ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంటులో ఉద్యోగి కాగా, అతని భార్య జయంతిమాల నర్స్‌గా పనిచేస్తోంది.

ఇటీవల ఆమె కొత్త ఆస్పత్రిలో విధుల్లో చేరింది. అప్పటి నుంచి ఆమె ప్రవర్తనలో మార్పులు మొదలయ్యాయి. దీంతో అనుమానం వచ్చి భర్తను నిలదీయగా అక్రమ సంబంధం విషయం బయటపడింది. దీంతో భర్తను దారుణంగా కత్తితో పొడిచి చంపింది. అనంతరం రోడ్డు ప్రమాదంలో మరణించినట్టుగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేసింది. ఈ దారుణానికి సదరు మహిళ తల్లిదండ్రులు కూడా సహకరించినట్టు సమాచారం. అయితే, పోస్టుమార్టం నివేదికలో అసలు నిజం బయటపడటంతో మహిళతోపాటు, ఆమె కుటుంబసభ్యులు మరో ఐదుగురు కూడా కటకటాలపాలయ్యారు.

Advertisement

Next Story