నిత్యం గొడవలు,అనుమానం..భర్త గొంతు కోసి భార్య హత్య

by Sumithra |
నిత్యం గొడవలు,అనుమానం..భర్త గొంతు కోసి భార్య హత్య
X

దిశ, మహబూబ్ నగర్ :
అనుమానం పెను భూతంగా మారండంతో పాటు నిత్యం గొడవలతో ఆ వివాహిత విసుగు చెందింది. ఎన్నోమార్లు సర్దుకుపోయిన ఆమె చివరకు కూతురి సాయంతో భర్తను హతమార్చింది.ఈ ఘటన వనపర్తి జిల్లా పెద్దమందడి మండల పరిధిలోని స్కూల్ తండాలో బుధవారం చోటుచేసుకుంది.పొలీసుల కథనం ప్రకారం..గ్రామ పంచాయతీ పరిధిలోని పుల్యాతండాకు చెందిన మెగావత్ బాల్య నాయక్, మన్నెమ్మ దంపతులు. ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చి నివాసముంటున్నారు. బాల్యనాయక్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. కరోనా లాక్‌డౌన్ పుణ్యమా అని ఆటోలు బంద్ కావడంతో తిరిగి కుటుంబమంతా సొంత తండాకు వెళ్లిపోయింది.ఈ క్రమంలోనే భర్త తన భార్యపై అనుమానం పడుతుండేవాడు.ఈ విషయం దంపతులిద్దరికీ నిత్యం గొడవలు జరుగుతు ఉండేవి. చాలా సార్లు ఓపికగా భరించిన భార్య మన్నెమ్మ తన కూతురు శారద సాయంతో మంగళవారం రాత్రి నిద్రిస్తున్న భర్త గొంతును కత్తితో కోసి హత్యచేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని హత్యకు గల కారణాలపై ఆరా తీశారు.అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాము తెలిపారు.నేరం జరిగిన స్థలాన్ని వనపర్తి డీఎస్పీ కిరణ్ కుమార్, కొత్తకోట సీఐ వై మల్లికార్జున్ రెడ్డి పరిశీలించారు.

Advertisement

Next Story

Most Viewed