- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్నేహితుడిని పిలిచి భర్తను చంపిన భార్య
దిశ, ఏపీ బ్యూరో: ఆ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం ఎంతో అన్యోన్యంగా ఉన్న వారి మధ్య విబేధాలు నెలకొన్నాయి. భర్త భార్యను వేధించడంతో ఆమె తట్టుకోలేకపోయింది. అంతే తన స్నేహితుడితో కలిసి తన భర్త అడ్డు తొలగించాలనుకుంది. తన స్నేహితుడితోపాటు ఐదుగురితో కలిసి భర్తను మట్టుబెట్టింది. అనంతరం ఏమీ తెలియనట్లు నటించింది. ఈ ఘటన నెల్లూరు నగరంలో జాకీన్ హుస్సేన్ నగర్ ప్రాంతంలో జరిగింది. ఫయాజ్, కల్యాణిలు భార్యభర్తలు. వీరిద్దరి మధ్య గత కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. అయితే భర్త ఫయాజ్ తనను వేధిస్తున్నట్లు కల్యాణి తన స్నేహితుల వద్ద వాపోయింది. నిత్యం వేధిస్తున్నాడని తన స్నేహితుడి వద్ద బోరున విలపించింది. చంపేయాలని చెప్పింది. దీంతో స్నేహితుడు మరో నలుగురు సాయంతో కల్యాణి భర్త ఫయాజ్‌ను హత్య చేశారు. అనంతరం కల్యాణి ఏమీ ఎరగనట్టు భర్తను ఆస్పత్రికి కూడా తీసుకెళ్లింది. ఫయాజ్ మరణంపై బంధువులకు అనుమానం వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. తామే హత్య చేసినట్లు కల్యాణి, ఆమె స్నేహితులు పోలీసుల ఎదుట అంగీకరించారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు నెల్లూరు డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి తెలిపారు.