- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TG Assembly: రాళ్లు, రప్పలున్న భూములకు రైతు భరోసా ఇద్దామా?.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ‘రైతు భరోసా’ (Raithu Bharosa) అమలుపై ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. ఇవాళ అసెంబ్లీలో రైతు భరోసాపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుబంధు (Raithu Bandhu) ముఖ్య ఉద్దేశం పెట్టుబడి సాయమని.. అన్నదాతల జీవితం భూమి చుట్టూనే తిరుగుతోందని అన్నారు. వ్యవసాయం చేసే రైతులకు పెట్టుబడి సాయం చేసే బాధ్యత తమపై ఉందన్నారు. గత ప్రభుత్వం సాగులో లేని భూమికి రూ.22 వేల కోట్లకు పైగా రైతుబంధు ఇచ్చారని గుర్తు చేశారు. రాళ్లు, రప్పులు ఉన్న భూములకు రైతు భరోసా ఇవ్వడం సరైందేనా అని ప్రశ్నించారు.
గతంలో రోడ్డు విస్తరణలో పోయిన భూమికి కూడా రైతుబంధు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయని అన్నారు. పోడు భూములకు రైతుబంధు పేరుతో కొందరు నేతలు లబ్ధి పొందారని ఆరోపించారు. అందులో బీఆర్ఎస్ (BRS) నేతలు, వారి బంధవులు కూడా రూ.వేల కోట్లు కొల్లగొట్టారని ఫైర్ అయ్యారు. కొందరు బడాబాబులు. జమీందార్లకు కూడా రైతు భరోసా ఇవ్వాలా అని ప్రశ్నించారు. ఇప్పటికే రైతు భరోసా విధివిధానాలపై మంత్రివర్గ ఉపసంఘం వేశామని, రైతులకు మేలు చేసే సూచనలు విపక్షాలు ఇస్తే తప్పకుండా స్వీకరిస్తామని అన్నారు.