- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sexual relationshipపక్కింటి వ్యక్తి తో భార్య రాసలీలలు.. చూసిన భర్త ఏంచేశాడంటే..?
దిశ, వెబ్‌డెస్క్: వారిది ఎంతో అందమైన కుటుంబం.. డబ్బు లేకపోయినా ప్రేమ ఆప్యాయతలతో నిండి ఉన్న బొమ్మరిల్లు.. అన్యోన్యంగా ఉండే భార్యాభర్తలు.. రత్నాలాంటి ఇద్దరు పిల్లలు.. కానీ వీరి కుటుంబంలో వివాహేతర సంబంధం అడ్డుగోడలు కట్టేసింది. ప్రియుడి మోజులో పిల్లలను వదిలి భార్య అతనితో వెళ్ళిపోయింది. అది తట్టుకోలేని భర్త ఆత్మహత్య చేసుకొని మృతిచెంది చిన్నారులను అనాథలను చేసిన విషాద ఘటన బీహార్ లో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే..
చంపారన్ ప్రాంతానికి చెందిన జోగేశ్వర్ (47) స్థానిక ఫ్యాక్టరీలో కార్మికుడుగా పనిచేస్తున్నాడు. అతని భార్య దీప (40). వీరికి ఇద్దరు కుమారులున్నారు. గతేడాది కరోనా కాలంలో అతని ఉద్యోగం పోవడంతో ఉపాధి పనుల కోసం అతను 4 నెలల క్రితం పాట్నా వలస వెళ్లాడు. ఈ సమయంలోనే ఇద్దరు పిల్లలతో ఒంటరిగా నివసిస్తున్న దీప పై అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి కన్నేశాడు. ఆమెకు మాయమాటలు చెప్పి ఆమెను లొంగదీసుకున్నాడు. ఇక మహిళ కూడా ఈ వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ ఇంట్లో పిల్లలు లేని సమయంలో ప్రియుడిని పిలిపించుకొని కామ క్రీడల్లో మునిగి తేలుతుండేవారు.
ఇక వీరి సంగతి తెలుసుకున్న పిల్లలు తన తల్లి చేస్తున్న పనిని జీర్ణించుకోలేకపోయారు. వెంటనే ఈ విషయాన్ని తండ్రికి చేరవేశారు. వెంటనే జోగేశ్వర్ భార్యను ఫోన్ లో మందలించాడు. దీంతో భార్య ఇంట్లో పిల్లలను వదిలేసి ప్రియుడితో వెళ్ళిపోయింది. ఈ విషయం తెలుసుకున్న భర్త ఆ అవమానాన్ని తట్టుకోలేక ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు రోజుల నుండి జోగేశ్వర్ ఇంటినుండి బయటికి రాకపోవడంతో అనుమానించిన పక్కింటివారు తలుపులు బద్దలుకొట్టి చూడగా ఫ్యాన్ కి విగతజీవిగా వేలాడుతూ కనిపించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.