- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆమెతో ఉంటున్నాడని భర్తపై భార్య దాడి
దిశ, సికింద్రాబాద్: భర్త వేరే మహిళతో సహజీవనం చేస్తున్నాడని విషయం తెలుసుకున్న భార్య దాడికి దిగింది. క్రికెట్ బ్యాట్, రోకలి బండ, తన సోదరులను వెంటేసుకొని వచ్చిన ఆమె.. భర్త, సదరు మహిళను చేతులు కట్టేసి చితకబాదింది. ఈ ఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధి తార్నాక స్ట్రీట్ నెంబర్‌లో 5లో జరిగింది.
వివరాళ్లోకి వెళితే.. టి. వెంకట్ 2004లో లక్ష్మీని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేసే వెంకట్‌కు అదే సంస్థలో లీనా అనే మహిళతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి పరిచయం కాస్తా సహజీవనానికి దారితీసింది. ఈ క్రమంలోనే ఆయన భార్యకు దూరంగా ఉండేవాడు. అయితే, మల్కాజ్‌గిరి ప్రాంతంలో ఇద్దరు కలిసే ఉంటున్నారని తెలుసుకున్న లక్ష్మీ భర్త తీరును జీర్ణించుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో వారి వద్దకు వెళ్లి గొడవ పడింది. దీంతో వెంకట్ తార్నాకకు షిఫ్ట్ అయ్యాడు. చివరకు ఈ అడ్రస్ కూడా తెలుసుకున్న లక్ష్మీ.. సోదరులతో కలిసి వచ్చి ఇద్దరినీ తీవ్రంగా గాయపర్చారు. జరిగిన దాడిపై వెంకట్ మేనమామ పీటర్ డేవీడ్ పోలీసులకు ఫిర్యాదు చేసి.. వెంకట్-లీనాలను సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించాడు.