విషాదం: కరోనాతో భార్య భ‌ర్తలు మృతి

by Sumithra |   ( Updated:2021-06-10 01:23:58.0  )
విషాదం: కరోనాతో భార్య భ‌ర్తలు మృతి
X

దిశ‌, ఖ‌మ్మం రూర‌ల్ : క‌రోనాతో వారం రోజుల వ్యవధిలో భార్య భ‌ర్తలు మ‌ర‌ణించిన సంఘ‌ట‌న రూర‌ల్ మండ‌లంలో చోటు చేసుకుంది. వివ‌రాల ప్రకారం.. రూర‌ల్ మండ‌లం పొన్నేక‌ల్లు గ్రామానికి చెందిన కోటి అమ‌ర‌య్య(70) కోటి అచ్చమ్మ(62) గ‌త ప‌ది రోజుల క్రితం క‌రోనా భారిన‌ప‌డ్డారు. చికిత్స కొసం హ‌స్పిట‌ల్‌కు వెళ్లి ఆసుపత్రిలోనే ఈ నెల 1న కోటి అమ‌ర‌య్య మ‌ర‌ణించ‌గా.. ఇంత‌లోనే భార్య అచ్చమ్మ కూడా గురువారం మ‌ర‌ణించింది. కుమారుడు శ్రీ‌నివాస‌రావుకు కూడా క‌రోనాతో చావు అంచు వ‌ర‌కు వెళ్లి జ‌యించాడు. వారం రోజులు వ్యవ‌ధిలోనే భార్య, భ‌ర్తలు మ‌ర‌ణించ‌డంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కోటి అమ‌రయ్య సీపీఎంలో క్రీయ‌శీల‌కంగా ప‌నిచేశారు. విష‌యం తెలుసుకున్న సీపీఎం జిల్లా పార్టీ కార్యద‌ర్శి నున్నా నాగేశ్వరావు, మండ‌ల కార్యద‌ర్శి నండ్ర ప్రసాద్‌, తుమ్మల శ్రీ‌ను, పెరుమాళ్లపల్లి మెహ‌న్‌రావు, సంగ‌య్య, స్థానిక స‌ర్పంచ్ తాటికొండ సుద‌ర్శన్‌లు వారి కుటుంబానికి ప్రగాడ సానుభూతిని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed