- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఫ్రెండ్స్ : ది రీయూనియన్’ ప్రసారాన్ని సెన్సార్ చేసిన చైనా
దిశ, సినిమా: ‘ఫ్రెండ్స్ : ది రీయూనియన్’ టెలికాస్ట్‌పై చైనా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాయి. అమెరికన్ సిట్‌కామ్ ఫ్రెండ్స్ 2021 రీయూనియన్‌పై రిలీజ్ అయిన షోను సెన్సార్ చేశాయి. లేడీ గాగా, బీటీఎస్, జస్టిన్ బీబర్‌ల ఫుటేజీ కట్ చేసి ప్రసారం చేశాయి. గతంలో వీరు ముగ్గురు నెగెటివిటీతో హెడ్ లైన్స్‌లో చేరగా చైనా రూలింగ్ పార్టీ ‘కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా’ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మతగురువు దలైలామాను కలవడంతో లేడీగాగాను 2016లో బ్యాన్ చేసిన చైనా.. జపాన్ యుద్ధంలో మరణించినవారి గౌరవార్థం టోక్యోలో నిర్మించిన ‘యసుకుని పుణ్యక్షేత్రం’ నుంచి తన ఫోటోను పోస్ట్ చేసిన జస్టిన్ బీబర్‌ను 2014లో బ్లాక్ చేసింది.
కొరియా యుద్ధంలో మరణించిన చైనా యోధుల గురించి ‘హిస్టరీ ఆఫ్ పెయిన్’ పేరుతో మాట్లాడిన బీటీఎస్ బ్యాండ్‌పై ఆ పార్టీ ఇప్పటికే కోపంగా ఉంది. దీంతో ‘ఫ్రెండ్స్ : ది రీయూనియన్’ షోను ఎడిట్ చేసి ప్రసారం చేసినట్లు సమాచారం. కాగా మే 27న హెచ్‌బీఓ మ్యాక్స్‌లో రిలీజ్ అయిన ‘ఫ్రెండ్స్ : ది రీయూనియన్’ సిట్యుయేషనల్ కామెడీ షో 104 నిమిషాల నిడివితో ఉండగా.. చైనాలో ప్రసారమైన సెన్సార్డ్ ప్రోగ్రామ్ తక్కువ నిడివితో ఉండటంపై అక్కడి అభిమానులు ఫైర్ అవుతున్నారు. అయితే దీనిపై అక్కడి స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ ఇంకా వివరణ ఇవ్వకపోవడం గమనార్హం.