- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
లాక్‌డౌన్‌లోనూ అక్షయ్ షూటింగ్?
బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ లాక్‌డౌన్ టైంలోనూ షూటింగ్‌లో పాల్గొన్నారు. అదేంటి జూన్ నుంచి కదా షూటింగ్ మొదలయ్యేది.. ఇప్పుడెలా షూటింగ్ స్టార్ట్ చేశారు అనుకుంటున్నారా ? ఇది సినిమా షూటింగ్ కాదులెండి.. ఓ ప్రభుత్వ ప్రకటన కోసం జరిగిన షూటింగ్. లాక్‌డౌన్ తర్వాత అందరూ యథావిధిగా పనులు చేసుకోవడంతోపాటు ఆఫీస్‌లకు వెళ్లాల్సి ఉంటుంది. మరి అలాంటి టైమ్‌లో కరోనా బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి ? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ ప్రకటనను రూపొందిస్తోంది.
బాల్కీ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ యాడ్‌ను లాక్‌డౌన్ నిబంధనలను అనుసరిస్తూ షూట్ చేస్తున్నారట. అతి తక్కువ మంది టెక్నీషియన్లను అందుబాటులో ఉంచుకుని ముంబైలో షూటింగ్ చేస్తున్నట్లు సమాచారం. ‘గుడ్ న్యూస్’ సినిమా తర్వాత అక్షయ్ పాల్గొంటున్న షూటింగ్ ఇదే.
కరోనా సమయంలో క్లిష్ట పరిస్థితులు తలెత్తగా.. పీఎం కేర్స్ ఫండ్‌కు రూ. 25 కోట్ల విరాళం అందించి మనసున్న మహారాజు అనిపించుకున్న అక్షయ్.. ఆ తర్వాత కూడా పోలీసులు, వైద్యులు, పారిశుధ్య కార్మికుల సంక్షేమం కోసం మరింత విరాళం అందించారు. విరాళాల సేకరణకు అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పోతున్న అక్షయ్… కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలను ఇంటి పట్టునే ఉంచేందుకు అవగాహన కల్పించడంలోనూ ముందున్నారు.