- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విజయమ్మ పేరుతో వైసీపీ వాళ్లే ఫేక్ లెటర్ రిలీజ్: టీడీపీ ఆరోపణ
దిశ, వెబ్ డెస్క్: వైఎస్ విజయమ్మ(YS Vijayamma) పేరుతో వైసీపీ(YCP) వాళ్లే ఫేక్ లెటర్ రిలీజ్ చేశారని టీడీపీ(TDP) ఆరోపణలు చేసింది. వైఎస్ విజయమ్మ పేరుతో సోమవారం మధ్యాహ్నం ఓ లేఖ హల్ చల్ చేసింది. 2024 ఎన్నికలకు ముందు జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి తన కుమారుడు వైఎస్ జగన్(YS Jagan)పై దుష్ప్రచారం చేస్తున్నారంటూ లేఖలో రాసి ఉంది. అంతేకాదు ఈ దుష్ప్రచారాన్ని విజయమ్మ ఖండించినట్లుగా కూడా ఉంది. అయితే ఆ లేఖ ఫేక్ అని టీడీపీ తేల్చింది. గతంలో విజయమ్మ రాసిన లేఖను, ప్రస్తుత లెటర్‌ను పక్కపక్కనే ఉంచి సంతకం విషయంలో ఉన్న తేడాలను వివరిస్తూ ఫేక్ లేఖ విడుదల చేశారంటూ విమర్శించింది. విజయమ్మ సంతకం కూడా వాళ్లే పెట్టి లేఖ విడుదల చేశారని ఎద్దేవా చేసింది. ఇలా సంతకాలు ఫోర్జరీ చేసే చెల్లి ఆస్తులు కొట్టేశావా అంటూ సెటైర్లు వేసింది. కొద్దిరోజలు క్రితం వైఎస్ షర్మిల(YS Sharmila) రిలీజ్ చేసిన లేఖలో విజయమ్మ సంతకానికి ఈ రోజు విడుదలైన లేఖలో సంతకానికి ఏ మాత్రం పొంతన కుదరలేదని వ్యా్ఖ్యానించింది.
ఇలా సంతకాలు ఫోర్జరీ చేసే, బాబాయ్ ని వేసేసి లెటర్ రాపించావా @ysjagan ?#PsychoFekuJagan#EndOfYCP#AndhraPradesh pic.twitter.com/DGLsy7Aw1G
— Telugu Desam Party (@JaiTDP) November 4, 2024