టెట్ ఎగ్సామ్‌లో మాకు మ్యాథ్స్ సబ్జెక్ట్ వద్దు.. సైన్స్ అభ్యర్థుల డిమాండ్

by Mahesh |
టెట్ ఎగ్సామ్‌లో మాకు మ్యాథ్స్ సబ్జెక్ట్ వద్దు.. సైన్స్ అభ్యర్థుల డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : టెట్ పరీక్ష నోటిఫికేషన్‌ను విద్యాశాఖ అధికారులు రిలీజ్ చేశారు. మంగళవారం నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈనెల 20వ తేదీ వరకు అప్లికేషన్లు స్వీకరించనున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. ఈ టెట్ లో సైన్స్ అభ్యర్థులకు మ్యాథ్స్ సబ్జెక్టును తొలగించాలనే డిమాండ్లు వస్తున్నాయి. తెలంగాణ టెట్‌లో బయోసైన్స్, ఫిజికల్ సైన్స్ అభ్యర్థులకు గణితం సబ్జెక్టును తొలగించాలని, దీని వల్ల సైన్స్ అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నట్లు వాపోయారు. ఈ విధానం వల్ల సైన్స్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని సైన్స్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుత పద్ధతిలో సోషల్ స్టడీస్ అభ్యర్థులకు ప్రత్యేక పేపర్ 2 నిర్వహిస్తున్నారని, అదే విధంగా బయో సైన్స్, ఫిజికల్ సైన్స్ అభ్యర్థులకు ప్రత్యేక పరీక్ష ఎందుకు ఉండకూడదని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత విధానం ప్రకారం సైన్స్ అభ్యర్థులకు గణితం సబ్జెక్టుకు సంబంధించి 30 మార్కులు ఉంటాయి. అదే సోషల్ స్టడీస్ కు పూర్తిగా 60 మార్కులకు ప్రత్యేక పేపర్ ద్వారా పరీక్ష నిర్వహిస్తున్నట్లు అభ్యర్థులు తెలిపారు. కాగా ప్రభుత్వం, విద్యా శాఖ తమ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవాలని సైన్స్ అభ్యర్థులు కోరుతున్నారు.

టెట్ షెడ్యూల్..

టెట్ అప్లికేషన్ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 20వ తేదీ వరకు దరఖాస్తు గడువు విధించినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ సోమవారం ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. కాగా పరీక్షలు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇతర వివరాలకు http:schooledu.telangana.gov.in వెబ్ సైట్ సందర్శించాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed