Chay- Sam: సమంతతో కలిసి నాగార్జునను మోసం చేసిన నాగచైతన్య..? అప్పుడు ఒళ్ళు మండి అల చేసినా కింగ్

by Kavitha |   ( Updated:2024-11-05 14:17:51.0  )
Chay- Sam: సమంతతో కలిసి నాగార్జునను మోసం చేసిన నాగచైతన్య..? అప్పుడు ఒళ్ళు మండి అల చేసినా కింగ్
X

దిశ, సినిమా: అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya), స్టార్ హీరోయిన్ సమంత(Samantha) ‘ఏ మాయ చేసావే’(Ye Maya Chesave) సినిమాలో జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ టైంలోనే వీరిద్దరు ప్రేమించుకున్నారు. అలా కొన్నేళ్లు ప్రేమించుకున్న వీరు.. ఇరు కుటుంబాల సమక్షంలో పెళ్లి కూడా చేసుకున్నారు. ఇక పెళ్లి చేసుకున్న వీరు 4 సంవత్సరాల వరకు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. కానీ సడెన్‌గా ఏం అయిందో ఏమో కానీ విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక విడాకుల తర్వాత సామ్.. మయోసైటీస్(Myositis) వ్యాధి బారిన పడి సినిమాలకు దూరం అయి హెల్త్‌పై ఫోకస్ పెట్టింది. ఇప్పుడు దాదాపు ఏడాది తర్వాత ‘సిటాడెల్: హనీ బన్నీ’(Citadel: Honey Bunny) అనే వెబ్ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇస్తోంది. ఇక నాగ చైతన్య విషయానికి వస్తే.. సమంతతో విడాకుల తర్వాత చైతన్య స్టార్ హీరోయిన్ శోభిత(Shobhitha)తో డేటింగ్‌లో ఉంటూ రీసెంట్‌గా ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నాడు. పెళ్లి పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. డిసెంబర్‌లో అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం. అయితే ఈ క్రమంలో నాగచైతన్య, సమంతకు సంబంధించిన ఓ విషయం వైరల్ అవుతోంది. అదేంటంటే.. నాగచైతన్యతో కలిసి సమంత నాగార్జున(Nagarjuna)ను మోసం చేసిందట. ఇద్దరు కలిసి నాగ్‌ను నమ్మించి మోసం చేశారట. ఇంతకీ విషయం ఏంటంటే..

గతంలో ఓ ఈవెంట్‌లో నాగార్జున మాట్లాడుతూ.. సమంత నాగచైతన్య ప్రేమించుకుంటున్నారన్న సంగతి నాకు చాలా లేట్‌గా తెలిసిందన్నారు. ఇద్దరు ప్రేమిచుకుంటూ.. ఎవరికి తెలియకుండా చాలా సీక్రేట్‌గా మెయింటేన్ చేశారని అన్నారు నాగ్. ‘ఏమాయ చేసావే’ సినిమా అప్పుడే జంట బాగుంది అనుకున్నాను. ‘మనం’ సినిమాలో నాతో పాటు వారు కూడా జంటగా చేశారు.. కానీ అప్పటికీ నాకు విషయం తెలియదు. అలా నాకు తెలియకుండా నన్ను మాయ చేసి.. ఆ సినిమాలో రొమాన్స్ చేశారు. ఇక ఒక సారి నేను ఇంట్లో ఉండగా.. సమంత మా ఇంటికి వచ్చింది.

సమంత రాగానే మా కుక్క వెంటనే సామ్ దగ్గరకు వెళ్ళింది. అరే దీనికి సమంత ఎలా తెలుసు అని నాకు ఆశ్చర్యం వేసింది. ఆ తరువాత సమంతనే చెప్పింది మామా అది తనకు ముందే తెలుసు అని. వెంటనే నాకు కోపం వచ్చింది. నన్ను ఇలా మోసం చేస్తారా అని మండింది. అయితే వెదవలకు మంచి పెళ్ళాలు వస్తారనేది పెద్దల మాట. అది నిజమే అయ్యింది. వీళ్ళిద్దరు ఇంత చేశారు.. నాకు ఎలా అనిపిస్తుంది చెప్పండి. ఇంత జరిగినా నాకు అంత లేట్‌గా తెలిసింది అంటూ నాగార్జున వీరు విడాకులు తీసుకోకముందు ఓ సందర్భంలో అన్నారు. ప్రస్తుతం నాగ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతోంది. కాగా నాగ్ ఈ కామెంట్స్ చేసినప్పుడు హీరో వెంకటేష్ కూడా పక్కనే ఉండడం విశేషం.


Advertisement

Next Story