కట్టడి చేయకపోతే కష్టమే : డబ్యూహెచ్‌వో

by Anukaran |
కట్టడి చేయకపోతే కష్టమే : డబ్యూహెచ్‌వో
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ మరింత ప్రమాదకరంగా మారే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ప్రపంచంలో చాలా దేశాలు కరోనాను కట్టడి చేసేందుకు సరైనా నిర్ణయాలు తీసుకోవడంలేదని.. అలా జరిగితే మరింత ప్రమాదకరమని డబ్ల్యూహెచ్ వో డైరక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అథనమ్ గేబ్రియాసిస్ అన్నారు. జెనీవాలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలు సరైనా చర్యలు చేపట్టకపోవడం వల్లే కేసులు పెరుగుతున్నాయన్నారు. కరోనాను కట్టడి చేసే విషయంలో దేశాధినేతల నుంచి వస్తున్న మిశ్రమ సందేశాల విషయంలో ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోందన్నారు. తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న కరోనాను నియంత్రించేందుకు కొన్ని ప్రభుత్వాలు సరైన విధంగా చర్యలు చేపట్టడంలేదన్నారు. మాస్కులు ధరించడం, చేతులు శుభ్రపరుచుకోవడం, సామాజిక దూరాన్ని పాటించే జాగ్రత్తలను ప్రభుత్వాలు, ప్రజలు సీరియస్ గా తీసుకోవడంలేదని ఆయన వెల్లడించారు. ఇలాగే కొనసాగితే పరిస్థితులు మరింత అధ్వానంగా తయారవుతాయన్నారు.

Advertisement

Next Story

Most Viewed