- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ఆటగాళ్లకు 100 కోట్లకు పైగా ఇచ్చిన ఐపీఎల్
దిశ, స్పోర్ట్స్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అంటే పరుగుల వరదే కాదు.. డబ్బుల ప్రవాహం. ఆటగాళ్ల కొనుగోళ్ల నుంచి వారికి లభించే అదనపు సంపాదన కోట్లలో ఉంటుంది. కేవలం డబ్బు కోసమే ఐపీఎల్ ఆడే ఆటగాళ్లు కూడా ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినా ఐపీఎల్ వంటి క్యాష్ రిచ్ లీగ్‌ను మాత్రం వదలడం లేదు. ఇక్కడ కేవలం 50 రోజుల క్రికెట్ ఆడితే రూ. కోట్లలో సొమ్ము బ్యాంకు ఖాతాల్లో చేరిపోతున్నది. ఇక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు, అత్యధిక సిక్స్ అవార్డులు ఉండనే ఉన్నాయి. ఇలా అన్ని రూపాల్లో డబ్బు వచ్చి పడుతుండటంతో క్రికెటర్లు కోటీశ్వరులుగా మారిపోతున్నారు. ఐపీఎల్ ప్రారంభంలోనే అత్యధిక ధరకు అమ్ముడు పోయిన ఎంఎస్ ధోనీ ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అత్యధిక జీతం అందుకుంటున్న క్రికెటర్‌గా నిలిచాడు. ఐపీఎల్ ద్వారా అతడు సంపాదించిన మొత్తం ఏనాడో రూ. 100 కోట్ల ను దాటిపోయింది. ఇలా వంద కోట్ల సంపాదనను దాటిపోయిన క్రికెటర్లు మొత్తం ఐదుగురు ఉన్నారు. వారిలో నలుగురు భారత క్రికెటర్లు కాగా, ఒకరు విదేశీ క్రికెటర్లు.
రూ.100 కోట్ల క్లబ్‌లో వీళ్లే..
ఐపీఎల్ జీతం ద్వారా రూ. 100 కోట్లు దాటిన మొదటి క్రికెటర్ ఎంఎస్ ధోనీ. ఐపీఎల్‌లో 14 సీజన్లు ఆడిన ధోనీ ప్రస్తుత జీతం రూ. 15 కోట్లు. అన్ని సీజన్లు కలిపి ఈ చెన్నై కెప్టెన్ రూ. 152.84 కోట్లు సంపాదించాడు. మధ్యలో రెండు సీజన్లు పూణేకు ఆడటం వల్ల అతడి జీతం తగ్గిపోయింది. లేకుంటే ఏనాడో 160 కోట్లు దాటి పోయేవాడు. ఇక రెండో స్థానంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. ఐపీఎల్ ద్వారా మొత్తం రూ. 146.66 కోట్లు సంపాదించాడు. ప్రస్తుతం అతడు అందుకుంటున్న జీతం రూ. 15 కోట్లు. ఐపీఎల్ ప్రారంభం నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్న విరాట్ కోహ్లీ మొత్తం రూ. 143.20 కోట్లు సంపాదించాడు.
2008లో రూ. 12 లక్షలకు కోహ్లీని ఆర్సీబీ కొనుగోలు చేసింది. అప్పుడు అతడు ఒక అన్‌క్యాప్డ్ ప్లేయర్. కానీ అతడిని విడుదల చేయకుండా రిటైన్ చేసుకుంటూ వస్తుండటంతో క్రమంగా జీతం పెరిగింది. ప్రస్తుతం ఐపీఎల్‌లో అందరికంటే ఎక్కువగా రూ. 17 కోట్ల జీతం అందుకుంటున్నాడు. ఇక 100 కోట్ల క్లబ్‌లో ఉన్న మరో ఆటగాడు సురేష్ రైనా. చెన్నైసూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న సురేష్ రైనా.. మధ్యలో గుజరాత్ లయన్స్ తరపున కూడా ఆడాడు. అతడు ఐపీఎల్ ద్వారా మొత్తం రూ. 110.70 కోట్లు సంపాదించాడు. ప్రస్తుతం అతడి జీతం రూ. 11 కోట్లు. కాగా, ఐపీఎల్‌లో రూ. 100 కోట్ల క్లబ్‌లో ఉన్న ఏకైక విదేశీ ఆటగాడు ఏబీ డివిలియర్స్. ఐపీఎల్ ద్వారా అతడు రూ. 102.51 కోట్లు సంపాదించాడు. ఆర్సీబీ జట్టు ప్రస్తుతం అతడికి రూ. 11 కోట్ల జీతం చెల్లిస్తున్నది.
ప్రస్తుతం టాప్ జీతాలు ఎవరివంటే..
గత సీజన్‌లో అందుకున్న జీతాలు, ఇటీవల జరిగిన వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
1. విరాట్ కోహ్లీ – రూ. 17 కోట్లు
2. క్రిస్ మోరిస్ – రూ. 16.2 కోట్లు
3. పాట్ కమ్మిన్స్ – రూ. 15.5 కోట్లు
4. ఎంఎస్ ధోనీ – రూ. 15 కోట్లు
5. రోహిత్ శర్మ – రూ. 15 కోట్లు
6. రిషబ్ పంత్ – రూ. 15 కోట్లు
7. కైల్ జేమిసన్ – రూ. 15 కోట్లు
8. గ్లెన్ మ్యాక్స్‌వెల్ – రూ. 14.2 కోట్లు
9. జై రిచర్డ్‌సన్ – రూ. 14 కోట్లు
10. డేవిడ్ వార్నర్ – రూ. 12.5 కోట్లు
11. సునిల్ నరైన్ – రూ. 12.50 కోట్లు
12. బెన్ స్టోక్స్ – రూ. 12.5 కోట్లు
13. సురేష్ రైనా – రూ. 11 కోట్లు
14. ఏబీ డివిలియర్స్ – రూ. 11 కోట్లు
15. మనీష్ పాండే – రూ. 11 కోట్లు
16. కేఎల్ రాహుల్ – రూ. 11 కోట్లు
17. హార్దిక్ పాండ్యా – రూ. 11 కోట్లు
18. క్రిష్ణప్ప గౌతమ్ – రూ. 9.25 కోట్లు
19. రషీద్ ఖాన్ – రూ. 9 కోట్లు
20. కృనాల్ పాండ్యా – రూ. 8.8 కోట్లు
వీరితో పాటు మరో 25 మంది క్రికెటర్లు రూ. 5 కోట్ల కంటే పైగా జీతం అందుకుంటున్నారు.