మైనార్టీ ఓట్లు ఎటువైపు

by Shyam |   ( Updated:2021-03-15 02:52:36.0  )
మైనార్టీ ఓట్లు ఎటువైపు
X

దిశ మక్తల్ : ఆదివారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మైనార్టీ ఓట్లు ఎటు వైపు పోలయ్యాయన్న విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మైనార్టీ వర్గంలో కూడా పట్టభద్రులు చాలామంది ఉన్నారు.వారు ఓటు వేసేందుకు ఆసక్తిగా పోలింగ్ రోజు ఉదయం నుంచి సాయంత్రం గడువు ముగిసిన సమయం పొడిగించినంతవరకు ఓపికతో లైన్లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అభ్యర్థి గెలుపుకు ప్రధానంగా మైనార్టీ ఓట్లు తోడైతే అన్న ప్రచారం ప్రస్తుతం పోటీలో ఉన్న అభ్యర్థుల్లో సాగుతుంది. కానీ రాజకీయ పార్టీల మద్దతు ఉండడం వల్ల గంపగుత్తగా వారి పెద్దలు చెప్పిన అభ్యర్థికే మేజార్టీ గా ఓట్లు వెస్తారనే ప్రచారం ఉంది. దీనితో ఆ వర్గం ఓట్లు ఏ అభ్యర్థికి దక్కేవి అన్నది చర్చనీయాంశం. ప్రాంతీయ పార్టీ మద్దతుగా నిలబడిన ఎమ్మెల్సీ అభ్యర్థిని తన తండ్రిగారి హయంలో మైనారిటీల మనోభావాలను దెబ్బ పడే విధంగా పాలన కొనసాగించారన్న విషయం మైనార్టీ వర్గాలు గుర్తు పేట్టుకున్నారా అన్న విషయం తెలియాలి.

ఇక జాతీయ పార్టీకి చెందిన అభ్యర్థిని మైనార్టీలు విశ్వసించక పోవడంతో ఓట్లు ఎటువైపు వెళ్తాయి అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న పార్టీల అభ్యర్థులకు మద్దతు ఇవ్వకుండా ఏ అభ్యర్థికి వీరి ఓట్లు మళ్లాయి అనేది చర్చనీయాంశం.

తమ మత విశ్వాసాలకు విరుద్ధంగా ఉన్న వారికి మైనార్టీలు ఓట్లు వేయరని. చట్టసభలో వాగ్ధాటిని వినిపించే వారికి గంప గుత్తగా ఓట్లువేస్తారని కొంతమంది రాజకీయ నాయకులు అంటున్నారు.ఇది ఇలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా పలు సమస్యలతో విఆర్వో. వి అర్ ఎ.పంచాయతీ సెక్రటరీల తమ గురించి చట్టసభలో తమకు న్యాయం జరిగేలా పోరాటం చేస్తాడని, స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇచ్చినట్టు సమాచారం, కొంతమంది స్థానిక సంస్థల ఉద్వోగస్తులు పి ఆర్ సి కోసం గోడ మీద పిల్లి లాగా వ్యవహరిం చారని రాజకీయ నాయకుల్లో చర్చ ఉంది. మక్తల్ మండలం లోని దాదాపు నాల్గు నుంచి ఐదు వందల వరకు ఓటు నమోదు చేసుకున్నవారున్నారు. మక్తల్ నియోజకవర్గంలో మండలాలలో పట్టభద్రులైన యువకులు మేజార్టి గా ఉన్నారు .

అమరచింత, ఆత్మకూరు మండలాల్లో దాదాపు రేండు వందలకుపైబడిన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకొని ఉంటారని, ఓటర్ లిస్ట్ను పరిశీలించిన రాజకీయ నాయకులు అంటున్నారు .నియోజకవర్గం మొత్తం గా దాదాపు ఎడు వందల నుంచి వెయ్యి మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకుని ఉంటారని వారందరూ ఏ వ్యక్తికి ఓటు వేయాలన్నది పేద్దల నిర్ణయం ప్రకారం గంపగుత్తగా ఓట్లు పోల్ అవుతాయి. దీనితో వారి ఓట్లు ఏటు వైపు మొగ్గుచూపుతారో ఆ అభ్యర్ధి గెలుపుకు కారణమైన ఉంటుందని రాజకీయ నాయకులు అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed