- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రమోషన్ వచ్చినా పాత పోస్టులోనే ఉన్నారు
దిశ ప్రతినిధి, కరీంనగర్: రెండున్నర దశాబ్దాల తరువాత కల సాకారం అయినా కార్యరంగంలోకి దిగడానికి మరో నెల రోజులు తప్పేట్టు లేదు వారికి. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సూపర్ న్యూమరరీ పోస్టులు క్రియేట్ చేసినప్పటికీ ఆ కుర్చీలో కూర్చోవాలంటే మరో నెలరోజులు ఆగక తప్పేలా లేదు. రాష్ట్రంలో 122 సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసి 97 మంది సీఐలను డీఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, వారికి సబ్ డివిజనల్ పోలీసు అధికారిగా బాధ్యతలు అప్పగించేందుకు మాత్రం మరి కొంతకాలం ఆగాల్సిన పరిస్థితే కనిపిస్తోంది.
ఎన్నికల తరువాతే…
సాగర్ ఉప ఎన్నికలు ముగిసిన తరువాత పదోన్నతులు వచ్చిన వారికి పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే, సాగర్ ఎన్నికల కారణంగానే పోస్టింగ్‌లు ఇవ్వలేకపోతున్నామన్న సంకేతాలు పంపించినా ఇదే బలమైన కారణం కాదని అర్థం అవుతోంది. మార్చి 31న పదోన్నతులు కల్పించినప్పటికీ వారు గతంలో మాదిరిగా సీఐలుగానే విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రధానంగా వీరందరిని అకామిడేట్ చేసేందుకు అవసరమైన ఖాళీల జాబితాను సేకరించాల్సి ఉంది.
అంతేకాకుండా కొంతమంది సీనియర్ పోలీసు అధికారులకు ప్రమోషన్ ప్యానెల్ తయారై ఉంది. వారు పదోన్నతి పొందితే కొన్ని సబ్ డివిజన్లు ఖాళీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. క్లియర్ వెకెన్సీస్ లిస్టు తయారైన తరువాత తాజాగా డీఎస్పీలుగా పదోన్నతి పొందిన పోలీసు అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు. అప్పటి వరకు ప్రమోషన్ పొందిన వారంతా యాక్టింగ్ సీఐలుగానే వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంది. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ కావాలంటే మరో నెల రోజుల పైనే పడుతుందని తెలుస్తోంది.