- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద బహిరంగ వేలం పాట
దిశ,కనగల్లు: ధర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద పూజ వస్తువులు అమ్ముకొనుటకు మంగళవారం బహిరంగ వేలంపాటలు నిర్వహించారు. దేవదాయశాఖ పరిశీలకులు బి.సుమతి,ఆలయ ఈవో జె.జయరామయ్య పర్యవేక్షణలో ఈ వేలం పాటలు జరిగాయి.టెండర్లల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయం వద్ద గాజులు, బొమ్మలు అమ్ముకొనుటకు నిడమనూరు మండలం గుంటిపల్లి గ్రామానికి చెందిన జి.నాగరాజు 9లక్షల 40వేలకు వేలంలో టెండర్ దక్కించుకోగా..కొబ్బరికాయలు,కిరాణం మానిటరింగ్ కు సరైన వేలం రానందున ఈనెల 30కి వాయిదా వేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చీదేటి వెంకటరెడ్డి, మాజీ ఎంపిటిసి నకిరేకంటే సైదులు గౌడ్,శంకర్ రెడ్డి, కొత్తమాసు ప్రభాకర్, సిపిఐ నాయకులు జినుకుంట్ల ఆంజనేయులు గౌడ్,గట్టిగుండ్ల చిన్న నరసింహ,ఆలయ అధికారులు జినుకుంట్ల చంద్రయ్య, నాగేశ్వరరావు,కూసం ఉపేందర్ రెడ్డి,రాజయ్య, ఎన్.ఆంజనేయులు, జె.నాగరాజు,సిహెచ్.శ్రీకర్, తదితరులు పాల్గొన్నారు.