Congress : ఓటర్లను ఏకపక్షంగా తొలగించలేదు.. కాంగ్రెస్‌కు ఈసీ క్లారిటీ

by Sathputhe Rajesh |
Congress : ఓటర్లను ఏకపక్షంగా తొలగించలేదు.. కాంగ్రెస్‌కు ఈసీ క్లారిటీ
X

దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ఏకపక్షంగా తొలగించలేదని ఎలక్షన్ కమిషన్ కాంగ్రెస్‌కు తెలిపింది. ప్రతి నియోజకవర్గంలో ఏకపక్షంగా ఓటర్లను తొలగించారని.. అదే సమయంలో పదివేల కంటే ఎక్కువ ఓటర్లను చేర్చారని కాంగ్రెస్ చేసిన ఆరోపణలపై ఈసీ మంగళవారం స్పందించింది. సాయంత్రం 5 గంటల పోలింగ్ డేటాతో తుది పోలింగ్ డేటాను పోల్చడం సరికాదని ఈసీ పేర్కొంది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11.45 గంటల వరకు పోలింగ్ శాతం పెరగడం సాధారమణమే అని ఈసీ తెలిపింది.

ఓటర్ డేటా మార్చడం అసాధ్యం..

ఏజెంట్లకు, అభ్యర్థులకు ఓటర్ టర్న్ అవుట్ డేటా వివరాలు తెలిపే 17 సీ ఫామ్ అందుబాటులో ఉందని ఈసీ పేర్కొంది. అందువల్ల ఓటింగ్ శాతాన్ని మార్చడం అసాధ్యమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. మహారాష్ట్ర ఓటర్ల జాబితా తయారీలో పారదర్శకత పాటించినట్లు ఈసీ తెలిపింది. ఓటర్ల తొలగింపు ప్రక్రియలో సైతం ఎలాంటి అవకతవకలు జరగలేవని పేర్కొంది. మహారాష్ట్రలోని ప్రతి నియోజవర్గానికి సంబంధించిన వివరాలు ‘సీఈవో మహారాష్ట్ర వెబ్‌సైట్‌’లో అందుబాటులో ఉన్నాయని అవసరమైతే డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది.

Advertisement

Next Story

Most Viewed