ఇంట్లో దొంగతనాలకు పాల్పడుతున్న భార్య భర్తల అరెస్ట్​ , రిమాండ్​

by Kalyani |
ఇంట్లో దొంగతనాలకు పాల్పడుతున్న భార్య భర్తల అరెస్ట్​ , రిమాండ్​
X

దిశ, చార్మినార్​ : ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడి తప్పించుకు తిరుగుతున్న కిలాడీ లేడీతో పాటు ఆమె భర్తను కాలాపత్తర్​ పోలీసులు అదుపులోకి తీసుకుని మంగళవారం రిమాండ్​కు తరలించారు. వారి వద్ద నుంచి రూ.3.20లక్షల విలువైన 16తులాల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఫలకనుమ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫలకనుమ డివిజన్​ ఏసీపీ ఎం.ఏ మాజీద్ చేసి కాలపత్తర్ ఇన్స్పెక్టర్ మొహమ్మద్ ఆసీఫ్ తో కలిసి వివరాలు వెల్లడించారు. రామ్నాస్ పురా కాలాపత్తర్​ ప్రాంతానికి చెందిన మొహమ్మద్​ యాకూబ్​ ఖురేషి ఈ నెల 14వ తేదీన 7 గంటలకు ఇంటి నుంచి పనిమీద బయటకు వెళ్ళాడు. కాసేపటికే అతని కుమారుడు కూడా బయటికి వెళ్లగా ఇంట్లో యాకుబ్​ ఖురేషి భార్యతో పాటు కోడలు ఇద్దరు పడుకొని ఉన్నారు.

అయితే మధ్యాహ్నం 1గంటల సమయంలో బెడ్​ రూమ్​ అల్మారా తెరిచి ఉందని, అందులో దాచి పెట్టిన బంగారం వెతకగా కనిపించకపోవడంతో తన భర్త, కుమారుడికి ఫోన్​ చేసి చెప్పింది. బీరువాలో దాచి ఉంచిన 40తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయని బాధితులు కాలాపత్తర్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాలాపత్తర్​ పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. చోరీకి పాల్పడిన నిందితులను పట్టుకోవడానికి డీసీపీ స్నేహ మెహ్రా,అడిషనల్ డీసీపీ మొహమ్మద్ మాజిద్ ఆదేశాల మేరకు క్రైం టీంను రంగంలోకి దింపారు. సి.సి కెమెరాలలో ఓ మహిళ దొంగతనానికి పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. సదరు మహిళ సి.సి కెమెరా దృశ్యాల ఆధారంగా మహమ్మద్ నగర్ బండ్లగూడ కి చెందిన జకీయా సుల్తానా(46) గా పోలీసులు గుర్తించారు.

ఆమె భర్త మొహమ్మద్ అబ్దుల్ సలీం(47) సహాయంతో చోరీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానించారు. మంగళవారం ఆ భార్యాభర్తలు చందులాల్ బరదారి అనుమానాస్పదంగా సంచరిస్తున్న భార్యభర్తలను కాలాపత్తర్​ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరాణ్ని అంగీకరించారు. వారి వద్ద నుంచి 16 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకొని ఇద్దరిని పోలీసులు రిమాండ్ కు తరలించారు. భార్యాభర్తలిద్దరు దొంగతనాలనే ప్రవృత్తిగా ఎంచుకున్నారని, జకీయా సుల్తానా పై ఇప్పటికే 8 పాత కేసులు ఉన్నట్లు ఏసీపీ మొహమ్మద్​ జావిద్​ పేర్కొన్నారు. ఈ కేసును కాలాపత్తర్​ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story