ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేయాలి

by Naveena |
ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేయాలి
X

దిశ, మిర్యాలగూడ : ప్రతి ధాన్యపు గింజను మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులకు సహకరించాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం మిర్యాలగూడ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన ఐకెపి సెంటర్ ను పరిశీలించారు. అనంతరం మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ..తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి రైతులకు మద్దతుగా నిలవాలని కోరారు. అధికారులు ఐకెపి సెంటర్ లో విక్రయిస్తున్న ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులకు బోనస్ వర్తించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్, మార్కెట్ కమిటీ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed