- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కప్ప కడుపులో కాంతి
దిశ, వెబ్‌డెస్క్: రాత్రి వేళల్లో మిణుకు మిణుకు మని కనిపించే మిణుగురు పురుగు.. కప్ప కడుపులో కూడా కాంతిని వెలిగించింది. ఇందేటని ఆశ్చర్యపోతున్నారా.. నమ్మడానికి సందేహంగా ఉన్న మీరు విన్నది నిజం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
‘నేచర్ ఈజ్ లిట్’ అనే ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేసిన 14 సెకన్ల నిడివి గల వీడియోలో ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. కప్పలు పురుగులను తినడం సహజం. కానీ, ఓ కప్ప మిణుగురు పురుగును మింగేసింది.. కడుపులోకి వెళ్లిన మిణుగురు మెరుస్తూ.. చివరికి కప్పను ఆందోళనలో పడేసింది. మిణుకు మిణుకు మంటు కప్ప కడుపులో కూడా మెరిసిన మిణుగురు వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. కేవలం పోస్టు చేసిన 18 గంటల్లోనే ఈ వీడియోను 73 లక్షలకు పైగా మంది వీక్షించడం గమనార్హం.
https://twitter.com/NaturelsLit/status/1304129916695273472?s=20