- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొత్త అప్డేట్ తో .. వాట్సాప్ వీడియో కాల్
దిశ వెబ్ డెస్క్: కరోనా వైరస్ ప్రభావం వల్ల దేశమంతా లాక్డౌన్ కొనసాగుతోంది. దీంతో వీడియో కాల్ యాప్స్ కు విపరీతమైన డిమాండ్ పెరిగింది. వాట్సాప్, ఫేస్ బుక్ మెసెంజర్, గూగుల్ డ్యుయో, స్కైప్ వంటి వాటిల్లోనూ వీడియో కాలింగ్ సౌకర్యమున్నా.. వీటిల్లో పరిమిత సంఖ్యలోనే వీడియో కాల్ మాట్లాడవచ్చు. కానీ ‘జూమ్’ లో ఎంతమందైన మాట్లాడుకోవచ్చు. లాక్ డౌన్ వల్ల ఆఫీస్ మీటింగ్స్, ఎడ్యుకేషన్ లెస్సన్స్ కోసం ‘జూమ్’ యాప్ ను వాడేవాళ్లు ఎక్కువయ్యారు. అయితే జూమ్ యాప్ అంతా శ్రేయస్కరం కాదని కేంద్రం తెలపడంతో.. చాలా మంది యూజర్లు అయోమయోంలో పడ్డారు. ఈ స్పేస్ ను వాట్సాప్ ఆక్రమించాలనుకుంటోంది.
వాట్సాప్ లో కూడా గ్రూప్ వీడియో కాలింగ్ ఆప్షన్ ఉంది. కానీ ఇది నలుగురికే పరిమితం. వాబెటాఇన్ఫో సమాచారం ప్రకారం వాట్సాప్ ఈ గ్రూప్ కాల్ సంఖ్యను మరింత పెంచడానికి ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఆ ఫీచర్ డెవల్మెంట్ దశలో ఉంది. ఆ సంఖ్య ఎంతన్నది వాట్సాప్ నుంచి క్లారిటీ లేదు . ఆ ఫీచర్ అందుబాటులోకి రాకముందే… లోపాలు(బగ్స్ ) సవరించే పనిలో ఉంది. వాట్సాప్ అప్డేట్ వర్షన్ లో ఇది అందుబాటులోకి వస్తుంది. లాక్డౌన్ కారణంగా కేవలం ఒకే నెలలో గ్రూప్ వీడియో కాల్ యాప్స్ వాడకం విపరీతంగా పెరిగింది. జూమ్ తో పాటు, మైక్రోసాఫ్ట్ టీమ్స్, టీమ్స్ ఫర్ ఎడ్యుకేషన్, స్లాక్, సిస్కో, వెబ్ ఎక్స్ వంటి యాప్స్ లను ఇప్పటికే లక్షల మంది డౌన్ లోడ్ చేయడమే ఇందుకు ఉదాహరణ. వాట్సాప్ లో కూడా మొన్నటి వరకు సెక్యూరిటీ ఎర్రర్స్ ఉండటంతో .. వాటిని పూర్తిగా తొలగించి చాలా సెక్యూరిటీ తో ముందుకు వచ్చింది. వాట్సాప్ కొత్త గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్ కూడా మార్కెట్లోకి వస్తే.. దానిలోని లోపాలు తెలుస్తాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
tags: coronavirus, lockdown, whatsapp, new feature, group call