- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇక వాట్సాప్ నుంచి షాపింగ్?
దిశ, వెబ్‌డెస్క్ : ఆన్‌లైన్ షాపింగ్ చేసే వారికి మరింత సౌకర్యాన్ని అందించే ఉద్దేశంతో ఇక నుంచి వాట్సాప్ ద్వారా షాపింగ్ చేసుకునే సదుపాయాన్ని ఫేస్‌బుక్ కల్పించబోతుంది. ఇందుకోసం చాట్‌లో ఇన్-యాప్ షాపింగ్ ఫీచర్‌లను అందించనుంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే నేరుగా వాట్సాప్ చాట్‌ల నుంచి షాపింగ్ చేసుకునే సదుపాయం కలుగుతుంది. వాట్సాప్ బిజినెస్ ఖాతాల ద్వారా ఈ షాపింగ్‌ను నిర్వహించుకోవచ్చు. షాపింగ్ యాప్‌లో ఉత్పత్తిని ఎంచుకుని దాని లింక్ ద్వారా వాట్సాప్‌లోనే పేమెంట్ చేసి, ఆర్డర్ పెట్టవచ్చు. గతంలో ఇలాంటి కేటలాగ్ ఫీచర్ వాట్సాప్‌లో ఉండేది. కానీ దాన్ని ఫేస్‌బుక్ మార్కెట్‌ప్లేస్‌కు మార్చారు. అంతేకాకుండా ఇటీవల ఆవిష్కరించిన ఫేస్‌బుక్ షాప్స్‌ను దీనికి లింక్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇవే కేటలాగ్‌లను ఇన్‌స్టాగ్రామ్ కూడా జత చేయడం వల్ల షాపింగ్ అనుభూతిని పూర్తిగా మార్చేయనుందని ఫేస్‌బుక్ తమ బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది. అయితే ఈ షాపింగ్‌కు పేమెంట్ కోసం వాట్సాప్ పేను ఉపయోగించవచ్చని, అది అందుబాటులో లేని దేశాల్లో ఫేస్‌బుక్ పే, అది కూడా లేకపోతే వేరే ఏదైనా యూపీఐ సర్వీస్ ద్వారా చేయవచ్చని తెలిపింది. అయితే చాలా దేశాల్లో ఈ ఫేస్‌బుక్, వాట్సాప్ పే యాప్‌లు ఇంకా అందుబాటులోకి రాలేదు కాబట్టి ప్రస్తుతానికి పేమెంట్ ఆప్షన్‌ను షాపింగ్ యాప్‌కే రీడైరెక్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని పేర్కొంది. ఏదేమైనా షాపింగ్ యాప్‌లు, సైట్‌లలో కూడా ఫేస్‌బుక్ ఆధిపత్యం రాబోతుందని దేశీ యాప్ సంస్థలు ఆందోళన చెందుతున్నాయి.